English | Telugu

భమ్ భమ్ భోలే షావలి.. అంబటి అర్జున్ సిల్లీ నామినేషన్!

బిగ్ బాస్ సీజన్-7 లో తొమ్మిదవ వారం నామినేషన్ తో మొదలైంది. 2.0 లో అడుగుపెట్టిన అయిదుగురిలో నయని పావని, పూజామూర్తి ఎలిమినేట్ అవ్వగా.. భోలే షావలి, అంబటి అర్జున్, అశ్వినిశ్రీ తమ సత్తా చాటుతున్నారు.

అంబటి అర్జున్ ఏదో మాస్క్ వేసుకొని ఉంటున్నట్టుగా తనలోని ఒరిజినల్ క్యారెక్టర్ ని బయటపెట్టకుండా, సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అనుకున్నదే అవుతుంది. నవ్వుతూ నామినేట్ చేస్తున్నాడు‌. ఎంతలా అంటే ఎద్దుల ఉన్నవాడు ఏడిస్తే బాగోదన్నట్టుగా.. అంత భారీ శరీరం పెట్టుకొని సింపుల్ గా కూల్ గా రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తున్నాడు‌. నిన్నటి మంగళవారం నాటి నామినేషన్ లో.. శోభాశెట్టిని నామినేట్ చేశాడు అంబటి అర్జున్. సిల్లీ రీజన్ నువ్వు చెప్తున్నావంటూ శోభాశెట్టి బాధపడింది‌.

భోలే షావలి నామినేషన్ అంటే ప్రేక్షకులలో యమ క్రేజ్ ఏర్పడింది‌. ఎందుకంటే ప్రియంక జైన్ నామినేషన్ లో భాగంగా.. నా నామినేషన్ భోలే అన్న అని ప్రియంక అనగానే.. ఎస్ ప్రియంక అటెండెన్స్ అని భోలే అనడంతో హౌస్ లో నవ్వులు పూసాయి. హౌస్ లో పాటలతో, మాటలతో కడుపుబ్బా నవ్వించే భోలే షావలి.‌. తనని తాను హీరో అనడంతో హౌస్ మేట్స్ అంతా అతడిని చూసి కామెంట్ చేసుకుంటు నవ్వుకుంటున్నారు. ఇక అమర్ దీప్ నామినేషన్ సిల్లీ అనిపించింది‌. భోలే షావలిని నామినేట్ చేసిన అమర్ దీప్.. నువ్వు మాట్లాడితే సూత్రాలు.. నేను మాట్లాడితే బూతులా అని అన్నాడు. నేను హౌస్ లో గుడ్ బాయ్ అనిలించుకున్నా, నువ్వేం అనిలించుకున్నావ్‌? ఒక్క గేమ్ గెలవలేదంటూ అమర్ దీప్ తప్పులని గుర్తు చేశాడు భోలే. ఇక వీరిద్దరి మధ్య సాగిన మాటల యుద్ధం ఆసక్తికరంగా సాగింది‌.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.