English | Telugu

నెంబర్ వన్ గా శివాజీ.. ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్ రా మామ!


బాస్ సీజన్-7 లో టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ శివాజీ. తన ఆటతీరుతో, మాటతీరుతో టాప్-5 లో ఒకడిగా ఉంటు వస్తున్నాడు శివాజీ. అయితే నాల్గవ వారం జరిగిన టాస్క్ లో శివాజీ చేతికి బలంగా గాయమైంది. అయితే ఆ వయసులో శివాజీ గేమ్ లో చూపించిన ఆసక్తికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అప్పటినుండి శివాజీ తన చేతినొప్పి ఇబ్బంది పెడుతున్న మేనేజ్ చేస్తున్నాడు.

అందరు ఈ సీజన్ శివాజీనే విన్నర్ అని అంటున్నారు. కామన్ మ్యాన్ కి అండగా ఉన్నాడు. అన్ని సినిమాలు చేసినగానీ ఏ మాత్రం ఇగో లేకుండా అందరితో కలిసిపోతున్నాడు. గతవారం శివాజీ బయటకి వెళ్ళడంతో అందరు ఎలిమినేటెడ్ అయ్యాడని అనుకున్నారు. కానీ చేతినొప్పి కోసం మెడికల్ టెస్ట్ లకు తీసుకెళ్ళారని తర్వాత తెలిసింది. ఇక హౌస్ లోకి మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చిన శివాజీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ప్రతీ గేమ్ లో యాక్టివ్ గా ఉంటూ తన తోటి హౌస్ మేట్స్ కి వెన్నంటే ఉంటున్నాడు. మొన్న జరిగిన టాస్క్ లో బుట్టలోని బాల్స్ ని ఒక్క చేతితో ఫాస్ట్ గా చేసి ప్రేక్షకుల సపోర్ట్ ని పొందాడు. ఇక సీరియల్ బ్యాచ్ చేసే తప్పులని అనుక్షణం కనిపెడుతూ వారి ఫౌల్ గేమ్స్ ని తిప్పికొడుతున్నాడు.

ఇక శోభాశెట్టి లాంటి ఫౌల్ గేమ్ ఆడే కంటెస్టెంట్ కూడా శివాజీ దగ్గరికి వెళ్లి మాట్లాడితే‌.. నువ్వు చేసింది తప్పు అనే చెప్తాడు. ఆటలోనైనా, మాటలోనైన శివాజీ ఒక్కడే హౌస్ లో ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడనేది అందరికి తెలిసిన నిజం. ఇక నామినేషన్ల ఓటింగ్ లో శివాజీ ఉన్నాడంటే అతనే టాప్. అది కూడా అత్యధిక మెజారిటీతో నెంబర్ వన్ గా ఉంటాడు. ప్రతి అనఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కూడా శివాజీనే టాప్ లో ఉంటూ ఓటింగ్ లో మొనగాడిలా దూసుకుపోతాడు. ఇదే ఫ్యాన్ బేస్ చివరిదాకా కొనసాగితే గ్రాంఢ్ ఫినాలేలో కూడా శివాజీ మొదటి స్థానంలో ఉండి టైటిల్ విజేత అయ్యేలా ఉన్నాడు. అయితే శివాజీ ప్రస్తుతం చేతి గాయంతో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అది సెట్ అవుతే శివాజీకి హౌస్ లో తిరుగులేదనేది వాస్తవం.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.