English | Telugu

బిగ్ బాస్ టీఆర్పీ అమర్ దీప్ వల్గర్ భాష వల్ల పడిపోతుందా?

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది. అయితే అమర్ దీప్ ఈ షోకి అప్పుడే ముగింపు చెప్పేలా ఉన్నాడు. ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ కుటంబంతో కలిసి బిగ్ బాస్ చూడలేకుండా చేస్తున్నాడు.

నిన్న జరిగిన నామినేషన్లో ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు చొప్పున ఇద్దరి పేర్లు చెప్పి తగిన వాదనలు వినిపించాలని చెప్పాడు బిగ్ బాస్. అయితే శుభశ్రీని, పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు అమర్ దీప్. వాళ్ళిద్దరికి చెప్పిన రీజన్లు కూడా తుప్పాస్ రీజన్లే అని స్పష్టంగా తెలుస్తుంది. జ్యూరీ సభ్యులైన శోభా శెట్టి, ఆట సందీప్, శివాజీ కూడా వ్యాలిడ్ పాయింట్ లేదంటూ చెప్పుకొచ్చారు. ఇక చేసేదేమీ లేక ఎవరో ఒకరిని నామినేషన్ లిస్ట్ లో పెట్టాలి కాబట్టి శుభశ్రీని లిస్ట్ లో చేర్చారు జ్యూరీ సభ్యులు. శుభశ్రీ నన్ను నామినేట్ చేసింది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని అమర్ దీప్ చెప్పేసరికి.. సిల్లీ రీజన్ లా అనిపించింది జ్యూరీ సభ్యులకి.. అయితే జ్యూరీ సభ్యులలో ఉన్న శోభా శెట్టి, ఆట సందీప్ ఇద్దరు అమర్ దీప్ కి సపోర్ట్ గా ఉండి శుభశ్రీని నామినేట్ చేశారు.

రీజన్ లేకుండా నామినేట్ చేశాడు నేను ఒప్పుకోనని శుభశ్రీ అనగా.. నా నామినేషన్ నా ఇష్టం అన్నట్టు అమర్ దీప్ బూతులతో రెచ్చిపోయాడు. మర్యాదగా మాట్లాడమని శుభశ్రీ అన్నా తనేం పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు అమర్ దీప్‌.‌ ఇక మహిళలని ఇలా కించపరుస్తూ, తోటి హౌజ్ మేట్స్ ని బూతులతో తిడుతున్న అమర్ దీప్ పై అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విమర్శలే వస్తున్నాయి. ఇక ఇలా అగ్రెసివ్ అవుతూ బూతులు మాట్లాడితే బిగ్ బాస్ షోని ఎవరు చూస్తారు.

అమర్ దీప్ మాట్లాడే భాష మరీ వల్గర్ ఉంది‌. ప్రతీసారి నామినేషన్లో తోటి హౌజ్ మేట్ ని అలా అరేయ్, ఒరేయ్ అంటూ అమర్ దీప్ కింద తక్కువ అన్నట్టు మాట్లాడటంతో గతవారం నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అయిన సరే అమర్ దీప్ తీరు మారలేదు. ఇక నాగార్జున అతడిని డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తేనే షో మారుద్దేమో. ఒక్క అమర్ దీప్ వల్ల షో టీఆర్పీ పడిపోతుందంటే బిగ్ బాస్ మేకర్స్ ఏమీ చేయలేరా అంటూ విమర్శకులు పలు ప్రశ్నలని సంధిస్తున్నారు.