English | Telugu

అమర్ దీప్ జర్నీ వీడియో.. సినిమా ట్రైలర్ లా ఉందంట!

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పద్నాలుగు వారాలు పూర్తయింది. ఇక పదిహేనవ వారంలో హౌస్ లో మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. పద్నాలుగవ వారం శోభాశెట్టి ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదట అమర్ దీప్ జర్నీ వీడీయోని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్.

హౌస్ మేట్స్ అందరిని లోపలే ఉంచి అమర్ దీప్ ని మాత్రం గార్డెన్ ఏరియాలోకి రమ్మని బిగ్ బాస్ చెప్పాడు. ఇక లోపలికి రాగానే మంచు కురుస్తుంది. ఇక లాంతరు దీపాలతో అలంకరించిన సెటప్ చూసి అమర్ దీప్ ఫిధా అయ్యాడు. ఇక అక్కడ తనకి సంబంధించిన ఫోటోలని చూసి మురిసిపోయాడు అమర్ దీప్. తను పవరస్త్రని కోల్పోయినప్పటి ఫోటో, శోభాకోసం ఆడిన బీన్ బ్యాగ్ ఫోటో, లేడీ గెటప్ లో ఉన్న ఫోటో, నామినేషన్ లోని ఫోటో , ఫ్యామిలీ వీక్ లో తేజస్విని గౌడ వచ్చినప్పటి ఫోటో ఇలా అన్ని ఫోటోలని బిబి మెమోరీస్ బుక్ అనే బుక్ లో ప్రింట్ చేసి ఇచ్చాడు బిగ్ బాస్. అదంతా అమర్ దీప్ కి ఒక సర్ ప్రైజ్ గా అనిపించింది. ఇక బిగ్ బాస్ యాక్టివిటి ఏరియాకి పిలిచి తన మాటలతో అమర్ దీప్ ని మరింత మోటివేషనల్ చేసాడు.

అమర్‌దీప్.. మీ పేరుకి అర్థం ఎప్పటికీ వెలిగే జ్యోతి. అదే విషయం మీ ప్రయాణంలో ప్రతిబింబించింది. ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లాలనే కసి నిరంతరం మీలో జ్వలిస్తూ ఎలాగైనా ప్రతి ఆటలో గెలిచి చివరి వరకు చేరాలనే మీ తపన మీ ప్రయాణాన్ని మలిచింది. మీ చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని మీ అల్లరిని మీ వెటకారాన్ని మీ స్నేహితులకన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నవారు లేరు. మిగతా వారికి తెలీకుండా మీరు మీ గోడౌన్‌లో దాచిన ఆహారం గురించి బిగ్ బాస్ కు తెలుసు. ఎవరెన్ని నిందలు వేసిన మీలోని పట్టుదల ఒక్క శాతం కూడా తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో పోరాడి ఫైనలిస్ట్ గా నిలిచారు. అమర్‌దీప్.. ఈ భూమి మీద పొరపాటు చేయని మనుషులు ఎవ్వరు లేరు. పొరపాట్లను తెలుసుకొని ముందుకు కదిలేవారిని ఎవ్వరు ఆపలేరని బిగ్ బాస్ అనగానే.. మీ మాటలు బాగున్నాయి బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత తన జర్నీ వీడియోని బిగ్ బాస్ చూపించగా, అది చూసిన అమర్ ఫిధా అయ్యాడు. బిగ్‌బాస్.. గెలుపు, ఓటములు, నా గమ్యం, జనం సమాధానం తప్ప నాకు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏం లేదు బిగ్‌బాస్. ఇది నా లైఫ్‌లో చాలా పెద్ద గిఫ్ట్. నా ఎమోషన్స్, నా పెయిన్, నా కోపం ప్రతీదీ చూపించారు. ఇంత బావుంటుందని అనుకోలేదు. ఎఫ్ అండ్ ఎఫ్.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఓకే తిట్టే వాళ్లు తిట్టుకోని ఎవరు ఏమైనా అనుకోని, చూడటానికి నాకు మాత్రం ఒక సినిమా ట్రైలర్‌లానే ఉంది బిగ్‌బాస్ అంటూ ఆడియన్స్ కి, బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు అమర్ దీప్.