English | Telugu

నా అనుకున్న వాళ్ళే నమ్మకద్రోహం చేశారు!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7లో ‘టికెట్‌ టు ఫినాలే’ కోసం టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇందులో కంటెస్టెంట్స్‌ తమ బలాన్ని నిరూపించుకుంటున్నారు. అయితే ఒక్కో గేమ్‌లో కంటెస్టెంట్స్‌ ఆటతీరుతో లెక్కలు మారిపోతున్నాయి. మొన్నటి ఎపిసోడ్‌లో లీస్ట్‌లో ఉన్న అమర్‌ దీప్‌.. శివాజీ, శోభాశెట్టి ఇచ్చిన పాయింట్లతో టాప్‌లోకి వచ్చాడు. అయితే నిన్నటి టాస్క్‌ ముగిసాక అమర్‌దీప్‌కు ప్రియాంక ఊహించని షాక్‌ ఇచ్చింది.

అయితే ఎత్తర జెండా టాస్క్‌లో ఫాస్ట్‌గా బోటులో ఇసుక నింపి మొదటి స్థానంలో నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. ఇక ఇందులో ప్రియాంక లీస్ట్‌లో ఉంది. లీస్ట్‌లో ఉన్న ఒకర్ని తప్పించాలి కాబట్టి ప్రియాంకని ఫినాలే అస్త్ర రేస్‌ నుంచి తప్పించారు బిగ్‌ బాస్‌. అయితే తన పాయింట్లను హౌస్‌లో ఉన్న వాళ్లలో తనకి నచ్చిన వాళ్లకి ఇవ్వాలని బిగ్‌ బాస్‌ చెప్పాడు. అయితే ప్రియాంక.. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ అమర్‌దీప్‌ని కాదని, తన అన్న గౌతమ్‌ కృష్ణకి ఇచ్చేసింది. నిన్న బాల్‌ టాస్క్‌లో అమర్‌దీప్‌ కొట్టిన దెబ్బకి, గౌతమ్‌కి పాయింట్లను ఇచ్చేసింది ప్రియాంక. అమర్‌, ప్రియాంక, శోభా ఈ ముగ్గురూ స్పా బ్యాచ్‌ అని అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఒకరికోసం ఒకరు ఆడుతున్నారు. కానీ నిన్నటి టాస్క్‌తో అమర్‌, ప్రియాంకల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అమర్‌పై రివేంజ్‌ తీర్చుకుంటూ తన పాయింట్లను గౌతమ్‌కి ఇచ్చేసి గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది ప్రియాంక. అదే తన పాయింట్లను అమర్‌కి ఇచ్చి ఉంటే అమర్‌ దీప్‌కి ‘ఫినాలే అస్త్ర’ వచ్చేసేది కానీ గౌతమ్‌కి ఇచ్చి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది ప్రియాంక.

ఇసుక టాస్క్‌ ముగిసాక అర్జున్‌ 360 పాయింట్లు, యావర్‌ 320 పాయింట్లు, ప్రశాంత్‌ 320 పాయింట్లు, గౌతమ్‌ 250 పాయింట్లతో ఉండగా అయితే ప్రియాంకకి 180 పాయింట్లు ఉన్నాయి. అవి గౌతమ్‌కి ఇవ్వడంతో గౌతమ్‌ పాయింట్ల సంఖ్య 430కి చేరింది. దీంతో గౌతమ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ 2కి వెళ్లిపోయాడు. దీంతో అమర్‌ దీప్‌ బాగా ఫీల్‌ అయ్యాడు. నేనే నిన్ను నమ్మి వెదవని అయ్యానని ప్రియాంకతో అమర్‌ దీప్‌ అన్నాడు. నా అనుకున్నవాళ్ళే నమ్మకద్రోహం చేశారంటూ శివాజీతో అనగా.. ప్రియాంక నీకే ఇస్తుందని అన్నావ్‌ కదరా అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత అమర్‌- ప్రియాంకల మధ్య జరిగిన గొడవని శోభాశెట్టి ఆపే ప్రయత్నం చేసింది. కానీ తనకి ఆకలి అవుతుందని ఏదైన వంట చేయమని ప్రియాంకకి ఎంత టైమ్‌ చెప్పినా తను బాధపడుతూనే ఉండటంతో శోభాశెట్టి అలిగి కోపంగా వెళ్లిపోయింది. ఇలా అమర్‌-ప్రియాంకల మధ్య గొడవ కాస్త.. శోభాశెట్టి-ప్రొయాంకల మధ్య గొడవకి దారితీసింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..