English | Telugu

అంబటి అర్జున్‌ ఫౌల్‌ గేమ్‌.. సంఛాలక్‌గా శోభాశెట్టి ఫెయిల్‌!

శోభాశెట్టి సంఛాలక్‌ అంటేనా సీరియల్‌ బ్యాచ్‌ కి ఫేవరిజమని మరోసారి బయటపడిరది. ఎంతసేపు ప్రశాంత్‌, యావర్‌, శివాజీల ఆట మీదే ఫోకస్‌ చేస్తూ.. అంబటి అర్జున్‌, గౌతమ్‌, అమర్‌, ప్రియంకల గేమ్‌ పట్టించుకోవట్లేదు శోభాశెట్టి. దీంతో బుధవారం నాటి టాస్క్‌ జరిగిన ఎపిసోడ్‌లో సంఛాలక్‌గా శోభాశెట్టి ఫెయిల్‌ అయింది.

ఎత్తర జెండా టాస్క్‌లో ఇసుక తీసుకొచ్చి పడవలో ఒకవైపుకి పోయాలని బిగ్‌ బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో సంచాలక్‌ గా శోభాశెట్టి, శివాజీ ఉన్నారు. ఇక బజర్‌ మోగగానే.. వరుసగా.. యావర్‌, అర్జున్‌, అమర్‌, గౌతమ్‌లు తమ పడవలను ఇసుకతో నింపారు. గౌతమ్‌ ఫౌల్‌గా ఆడాడు తన పడవలో ఒకవైపు ఉన్న ఇసుకని తీసుకొని మరోవైపు పోసాడు. ఇదే తన స్ట్రాటజీ అంటూ గౌతమ్‌ అనగా.. శివాజీ, శోభాశెట్టి ఫౌల్‌ అని చెప్పిన వినట్లేదు. దాంతో బిగ్‌ బాస్‌ ఫౌల్‌ అని చెప్పేశాడు. ఇక గేమ్‌లో సూపర్‌ ఫాస్ట్‌గా ఇసుక నింపిన పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలిచాడు. ఇక ప్రశాంత్‌తో కావాలని గొడవ పెట్టుకుంది శోభా. ఈ టైమ్‌లో అర్జున్‌ ఒక ఫౌల్‌ చేసాడు. అది ఎవరు గమినించలేకపోయారు. అందరికంటే గేమ్‌లో మొదటి స్థానంలో ప్రశాంత్‌, రెండవ స్థానంలో యావర్‌, మూడవ స్థానంలో అర్జున్‌.. లాస్ట్‌లో ప్రియాంక తన పడవను ఇసుకతో నింపి చివర్లో గంట కొట్టింది. అయితే ఈ టాస్క్‌లో అందరికంటే ముందు జెండా ఎగరేసిన ప్రశాంత్‌కి అందరికంటే ఎక్కువగా 100 పాయింట్లు సంపాదించాడు. యావర్‌ 90, అర్జున్‌ 80, అమర్‌ 70, గౌతమ్‌ 60, ప్రియాంక 50 పాయింట్లను సాధించింది.

అయితే గేమ్‌ మధ్యలో ప్రశాంత్‌ ఒక చేతితో ఇసుకని పట్టుకుంటున్నావంటూ తనని అపే ప్రయత్నం చేయగా.. శివాజీ మధ్యలో కలుగజేసుకొని అందరూ అలానే చేస్తున్నారంటూ శోభాకి చెప్పాడు. ఈ డిస్కషన్‌ టైమ్‌లో అర్జున్‌ ఫౌల్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు. అర్జున్‌ ఇసుక వేసే టైమ్‌లో తన పడవను టచ్‌ చేశాడు. అప్పుడు ఇసుక కూడా వేయడంతో ఆ ఫోర్స్‌తో అతని పడవ ఈజీగా పైకి లేచింది. అతను కావాలనే ఫౌల్‌ గేమ్‌ ఆడాడో.. లేదంటే అనుకోకుండా పడవకి తన చేయి టచ్‌ అయ్యిందో కానీ.. అతను పడవను టచ్‌ చేయడం అయితే కనిపించింది. బరువు నిండిన వైపు చిన్న టచ్‌ చేసినా కూడా ఈజీగా పైకి లేచిపోతుంది. అర్జున్‌ ఇదే స్ట్రాటజీ వాడాడు. అయితే దాన్ని సంచాలక్‌గా ఉన్న శోభాశెట్టి గమనించలేదు. మరి నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్‌లో అర్జున్‌, శోభాశెట్టిలకి వార్నింగ్‌ ఇస్తాడో లేదా చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.