English | Telugu
అమర్ బావ విత్ మనోభావాలు పాపా..విష్ణు ప్రియతో కంటే సుబ్బు- అమర్ దీప్ కాంబో సూపర్
Updated : Feb 7, 2025
అమర్ దీప్ చౌదరి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాన్స్ ఇరగదీసేస్తాడు. సీరియల్స్ తో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు . ఇక బిగ్ బాస్ షోతో అమర్ దీప్‌కు మంచి క్రేజ్ వచ్చింది. చివరకు రన్నర్ గా బయటకు వచ్చేశాడు. అమర్ దీప్ తన సహ సీరియల్ నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంట ఇష్మార్ట్ జోడి 3 లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే మరో వైపు బిగ్ బాస్ శుభశ్రీతో కలిసి స్టెప్పులేస్తున్నాడు.
రీసెంట్ గా శేఖర్ మాష్టర్ "కు..కు..కుమారి" అంటూ విష్ణు ప్రియా, అమర్ దీప్ తో కలిసి చేసిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ రిలీజయిన మూడు వారాళ్ళూ 4 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సాంగ్ కి అమర్ దీప్ సుబ్బుతో కలిసి ఇన్-డోర్ స్టూడియోలో చేసిన డాన్స్ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ ని సునీల్ సున్నపు కొరియోగ్రాఫ్ చేసాడు. ఐతే సుబ్బు, అమర్ దీప్ డాన్స్ కి నెటిజన్స్ ఐతే అద్దిరిపోయే కామెంట్స్ ఇస్తున్నారు. ఈ డాన్స్ కి అర్జున్ కళ్యాణ్, తేజస్విని ఐతే ఫైర్ ఎమోజిస్ పెట్టారు. అమరదీప్ హెయిర్ స్టైల్ మీద ఒక నెటిజన్ క్రేజీ కామెంట్ చేశారు. "అన్నా మీ ఓల్డ్ హెయిర్ స్టైల్ బాగుంది. ఇది బాలేదు" అంటూ చెప్పుకొచ్చారు. కొంతమందైతే విష్ణుప్రియతో కంటే సుబ్బుతో డాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.