English | Telugu

Brahmamudi : ఇంటిపెద్ద ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళిద్దరు.. పాప బారసాలలో అనామిక ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -639 లో.....అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. తనని చూసి కావ్య చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా చెల్లి ఎస్సై అయిందని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఈ వేషం గెటప్ బాగుందని రుద్రాణి వెటకారంగా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చెయ్యడానికి వచ్చావా అంటూ మాట్లాడుతుంటుంది. నా భార్య ఎస్సై అయింది. పెద్దల ఆశీర్వాదం తీసుకుందామని వచ్చామని కళ్యాణ్ అంటాడు. కాసేపటికి ముందుగా ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మ, నాన్న ఆశీర్వాదం తీసుకోమని అపర్ణ అనగానే.. అంటే తనకి ఇష్టం ఉందో లేదో అని కళ్యాణ్ అంటాడు. నాకు నీ సంతోషం ముఖ్యమని ఆశీర్వాదం తీసుకోండి అన్నట్లుగా ముందు కి వస్తుంది. దాంతో అప్పు, కళ్యాణ్ లు ధాన్యలక్ష్మి, ప్రకాష్ ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

ఇకనైనా ఇక్కడే అందరం కలిసి ఉందామని ఇందిరాదేవి అంటుంది. ఇంకా కళ్యాణ్ అనుకున్నది సాధించలేదు కదా.. అయినా ఎలా వస్తాడంటూ రుద్రాణి అనగానే.. చూసారా ఈ ఇంట్లో మా అమ్మతో పాటు ఇద్దరికి మేమ్ రావడం ఇష్టం లేదు.. అందుకే అందరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న రోజు మేమ్ వస్తామని కళ్యాణ్ అంటాడు. రేపు స్వప్న కూతురు బారసాల ఉంది.. కావ్య, రాజ్ తో పాటు మీరు దగ్గర ఉండి జరిపించండి అని ఇందిరాదేవి అనగానే కళ్యాణ్ సరే అంటాడు. ఆ తర్వాత ముగ్గురు అక్క చెల్లెలు కలిసి బారసాలకి ఏర్పాట్లు చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే స్వప్న కూతురు ఏడుస్తూ ఉంటుంది. స్వప్న ఎంత ఎత్తుకున్నా కూడా పాప ఏడుపు ఆపదు. దాంతో కావ్య ఎత్తుకొని జోకొడుతూ పాట పాడుతుంది. దాంతో పాప నిద్రపోతుంది.

ముగ్గురు అక్కచెల్లెళ్ళు సరదాగా ఉండడం అపర్ణ, ఇందిరాదేవిలు చూసి మురిసిపోతారు. వాళ్ళని చూస్తుంటే నేను పెళ్లి అయిన కొత్తలో ఇక్కడికి వచ్చిన రోజులు గుర్తు వస్తున్నాయ్.. రాజ్ ని అందరు గారాబం చేసేవాళ్ళని అపర్ణ అంటుంది. కానీ ఇప్పుడు డబ్బు వల్ల కుటుంబం విచ్చినం అన్న ఆలోచన వస్తుందని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణి, అనామికలు ఫోన్ లో మాట్లాడుకుంటారు. రేపు బారసాలకి నేను ఎంట్రీ ఇస్తున్నాను.. నేను చేయబోయే దానికి అందరు బాధపడతారు.. చూడడానికి రెడీ గా ఉండమని రుద్రాణికి అనామిక చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.