English | Telugu

నీకు ఖర్చులకు పైసలు యాడ నుండి వస్తాయి బ్రో...కౌశల్ కి షాకిచ్చిన నెటిజన్  

నీకు ఖర్చులకు పైసలు యాడ నుండి వస్తాయి బ్రో...కౌశల్ కి షాకిచ్చిన నెటిజన్  

 

బుల్లితెర మీద కౌశల్  మందా గురించి  తెలియని వారు ఎవరూ ఉండారు. మూవీస్ లో, సీరియల్స్ లో, షోస్ లో నటిస్తూ ఉంటాడు. బిగ్ బాస్ కి వెళ్లి తనకంటూ సెపరేట్ ఆర్మీని  ఏర్పాటు చేసుకున్న నటుడు. అలాంటి కౌశల్ ని ఒక క్రేజి నెటిజన్ ఒక ప్రశ్న అడిగాడు రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో. కౌశల్ ఊరుకుంటాడా. గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. "మనలో మన మాట బ్రో ..నీకు ఖర్చులకు పైసలు యాడ నుండి వస్తాయి" అని అడిగాడు ఒక నెటిజన్..

" నా చెమట నుంచి " అని రిప్లై ఇచ్చాడు కౌశల్. వెంటనే ఆ నెటిజన్ మళ్ళీ " సాల్ట్స్, ఎలెక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఎమినో ఆసిడ్స్, ఫెరొమోన్స్, అండ్ బాక్టీరియా గురించి కాదు అడిగింది " డబ్బుల గురించి" అని మళ్ళీ కౌంటర్ క్వశ్చన్ వేసాడు. ఇంకో క్రేజి నెటిజన్ ఐతే "అన్నో ఆ పాత బిగ్ బాస్ కప్ ఏది అన్నా ? అది పక్కలో ఉంటాదిగా ? అన్నాడు"..ఐతే కౌశల్ తన కార్ ని ఒక బెడ్ గా మార్చే ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "నా కార్ ని ఎలా ట్రావెల్ బెడ్ గా మార్చానో" అంటూ చూపించాడు. ఆ బెడ్ మీద పడుకుని ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు..లగేజ్ సీట్స్ కింద పెట్టేసాం అని చెప్పుకొచ్చాడు. ఐతే కొంతమంది నెటిజన్స్ ఐతే ఇలా బెడ్ గా ప్రిపేర్ చేసుకుని ట్రావెల్ చేయడం సేఫ్ కాదు అంటూ కామెంట్ చేసారు. బిగ్ బాస్ 2 లో కౌశల్ ఒక సెన్సేషన్.