English | Telugu

కరవద్దంటే పాముకి కోపం... కరవమంటే కప్పకి కోపం మధ్యలో అమర్ దీప్!

బిగ్ బాస్ సీజన్-7 లో ది మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ ‌ఎవరంటే శోభాశెట్టి అని అందరు చెప్తుంటారు. బిగ్ బాస్ సీజన్-7 తుదిదశకు చేరుకోవడంతో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్, యావర్, ప్రశాంత్, అర్జున్ హౌస్ లో ఉన్నారు. కాగా ఓట్ అప్పీల్ కోసం గత వారం రోజులుగా టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో వండర్ ఉమెన్ గా రెడీ చేయాలని రెండు టీమ్ లకి చెప్పాడు. శోభా శెట్టిని యావర్-అర్జున్ కలిసి రెడీ చేశారు. ఇక ప్రియాంకను శివాజీ-ప్రశాంత్‌లు ముస్తాబు చేశారు. దీనికి అమరం సంచాలక్‌గా వ్యవహరించాడు. ఇక రెడీ అయిన ఇద్దరూ బాగానే స్టిల్స్ ఇచ్చారు. ఇద్దరూ సమానమే కానీ వండర్ ఉమెన్‌గా ప్రియాంకను డిక్లర్ చేస్తున్నానని అమర్ అనౌన్స్ చేయగానే శోభాశెట్టి ముఖం మాడిపోయింది. అయిన శోభా థండర్ ఉమెన్‌ కానీ వండర్ ఉమెన్ కాదుగా అనుకున్నాడో ఏమో కానీ అమర్ దీప్ మాత్రం ప్రియాంకకే ఓటు వేశాడు.

ఇక టాస్క్ ముగిసాక.. " ఇది నేను ఊహించిందే" అంటూ అర్జున్‌తో శోభా అంది. అలా శోభాశెట్టి అన్నది విన్న అమర్ దీప్ ఫైర్ అయ్యాడు. ఫన్ టాస్క్ ఫన్‌గా తీసుకో పిచ్చిదానా అని అనగా.. పిచ్చి గిచ్చి అనకు అమర్.. ఏం మాట్లాడుతున్నావ్? ఊహించినవాళ్లకే ఇచ్చినప్పుడు అలానే వస్తాయ్ మాటలు అంటూ శోభా పొగరు చూపించింది. అమర్ దీప్ కోపంగా లోపలికి వెళ్లి.. మనకి మనకి మధ్య యునిటీ లేకపోతే ఎలా శోభా.. కాసేపు ప్రశాంతంగా ఉండవే.. ప్రతి చిన్న విషయానికి కొట్లాడి చస్తావ్ అంటూ ఫ్రస్ట్రేషన్‌తో పక్కకి పోయాడు. తర్వాత కెమెరా దగ్గరికెళ్లి వండర్ ఉమెన్స్ కాదు నాకు సెవన్ వండర్స్ కనిపించాయంటూ కెమెరాలకు చెప్పుకున్నాడు అమర్ దీప్. అయితే అక్కడే ఉన్న అర్జున్ వెంటనే కెమెరా దగ్గరికెళ్లి.. "బిగ్‌బాస్ నాకు ఒక సామెత గుర్తొచ్చింది. కరవద్దంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపం అన్నట్టు మధ్యలో వీడు ఉండిపోయాడు" అని అమర్ ని ఉద్దేశించి అర్జున్ చెప్పాడు. దీంతో ఏమనాలో తెలిక అమర్ అలా నవ్వుకుంటూ లోపలికి పోయాడు. కానీ శోభా దెబ్బకి మాత్రం అమర్‌కి చుక్కలు కనిపించాయనేది వాస్తవం.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.