English | Telugu

Brahmamudi:ప్రేమకి, పెళ్ళికి మధ్య ఆ జంట చేసిన పూజ ఫలిస్తుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -274 లో.. అనామిక జాతకంలో దోషం ఉందని పంతులు గారు చెప్పడం, దానికి తోడు కనకం జాతకాలు కలవకుంటే మంచి జరగదని చెప్పడంతో, అన్ని మనసులో పెట్టుకొని భోజనం చెయ్యకుండా ధాన్యలక్ష్మి అలోచిస్తుంటుంది. ఏంటి భోజనం చెయ్యకుండా అలోచిస్తున్నావని ఇంట్లో వాళ్ళంతా ధాన్యలక్ష్మిని అడుగుతారు.

జాతకాలు కలవనప్పుడు పెళ్లి ఆపేయడమే బెటర్ అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత భోజనం దగ్గర నుండి కళ్యాణ్ వెళ్ళిపోబోతుంటే రాజ్, కావ్య ఇద్దరు తనని అపి మా జాతకాలు చూసి పెళ్లి చేసారా? మేం ఎంత హ్యాపీగా ఉన్నాం.. మీ అన్నయ్య హనీమూన్ కి కూడా ప్లాన్ చేసాడని కావ్య చెప్తుంటే రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. అలా అందరూ కళ్యాణ్ లో దిగులు పోగొట్టేలా మాట్లాడుతారు. పూజ చేస్తే దోషం పోతుందని చెప్పారు కదా అది చేద్దామని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాజ్ కోపంగా కావ్య దగ్గరకి వెళ్లి అందరి ముందు హనీమూన్ ప్లాన్ చేశానని ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతాడు. ఇక కావ్య వెటకారంగా మాట్లాడేసరికి రాజ్ కి చిరాకు వేస్తుంది. మరొక వైపు స్వప్న పూజకి రెడీ అవుతుంటే కనకం వచ్చి.. నువ్వు పూజ దగ్గరికి వద్దు ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఆ తర్వాత అప్పు నిమ్మ మొక్కలు తీసుకోని వస్తుంది. ఒక్కటే అవసరం కదా నువ్వు ఎందుకు మూడు తీసుకొని రమ్మన్నావని అప్పు అడుగుతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి అవును ఒక్కటే అవసరం కదా? ఎందుకు అన్ని తీసుకోని రమ్మన్నారని అడుగుతాడు. కనకం ముందు జాగ్రత్త కోసం అని కవర్ చేస్తుంటుంది. ఆ తర్వాత అప్పు వెళ్తానంటే ఇక్కడే ఉండు అంటు కళ్యాణ్ తన భుజాలపై చెయ్యి వేసుకొని తీసుకుని వెళ్తాడు. అది చూసి కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తుంటుంది అప్పు.

కాసేపటికి అనామిక, కళ్యాణ్ ఇద్దరు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నిమ్మ మొక్కని నాటుతారు. ఈ మొక్క ప్రొద్దున వరకు బాగుంటే దోషం పోయినట్టే వాడిపోతే జాతకాలు కలవనట్టేనని పంతులు గారు చెప్తారు. మన ప్రేమ నిజం అయితే మనం అనుకున్నది జరుగుతుందని కళ్యాణ్ అంటాడు. అలా అందరూ దోషం పోయి మొక్క పచ్చగా ఉండాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.