English | Telugu
పెళ్లయితే ఫ్రీడమ్ పోతుంది.. అందుకే పెళ్లి మీద ఇంటరెస్ట్ లేదు!
Updated : Nov 8, 2022
'ఊర్వశివో.. రాక్షసివో' మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ 'ఆలీతో సరదాగా' షోకి వచ్చాడు. ఇక ఈ షోలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పాడు. "మూవీస్ లోకి రాకపోయి ఉంటే గనక జర్నలిజం చేసి జర్నలిస్ట్ గా వెళ్ళేవాడిని. నాకు మీడియా అంటే చాలా ఇష్టం. నాకు, బన్నీకి చిన్నప్పటినుంచి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే పిచ్చి. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అది ఎంత డేంజరస్ అనే విషయం తెలిసింది. ఇద్దరం గోడల మీద నుంచి ఒకరినొకరం పట్టుకుని దూకి పడిపోవడం, కొట్టుకోవడం చేసాం. కానీ సినిమాల్లాఅది ఫేక్ అన్న విషయం అప్పటికి మాకు తెలియదు. కానీ రక్తాలొచ్చేసేలా కొట్టేసుకునేవాళ్ళం. ఎవరైనా నన్ను ఏమౌతావ్ పెద్దయ్యాక అని అడిగితే సీరియస్ గాడబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్లేయర్ ని అవుతా అని చెప్పేవాడిని." అని తెలిపాడు.
"మా నాన్న గర్వపడాలంటే ఏం చేయాలో ఇంకా నాకు తెలీదు. కానీ మా అమ్మ గర్వపడాలంటే నేను పెళ్లి చేసుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు.. నాకు పెళ్లంటే చాలా భయం.. ఇప్పటి వరకు సింగల్ గా ఉన్నా. పెళ్ళైతే ఫ్రీడమ్ మొత్తం పోతుంది కదా అందుకే పెళ్లి మీద పెద్ద ఇంటరెస్ట్ లేదు." అని తన అభిప్రాయం చెప్పాడు.
"చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో చేసాను. తర్వాత దాసరి నారాయణరావు గారు 'మాయాబజార్' అనే మూవీలో అందులో దాసరి గారి ఫ్లాష్ బ్యాక్ రోల్ లో నేనే యాక్ట్ చేసింది. చిన్నప్పుడు 'జగదేక వీరుడు అతిలోక సుంద'రి షూటింగ్ సెట్ లో అమ్రిష్ పురి గారిని చూసి చాలా భయపడ్డాను. ఆయన వాయిస్ అంటే భయం నాకు. కానీ తర్వాత ఆయన నాతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి ఆయన మనల్ని ఏమీ చేయడు అనిపించింది.." అని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు శిరీష్.