English | Telugu
"చచ్చి బతికా"... రోగాన్ని బయటపెట్టిన 'అల్లరి' సుభాషిణి
Updated : Aug 7, 2021
చాలా రోజుల తరవాత సుభాషిణి కనిపించారు. సుభాషిణి కంటే 'అల్లరి' సుభాషిణిగా పరిశ్రమలో ఈవిడ పేరు తెచ్చుకున్నారు. రవిబాబు 'అల్లరి'తో పాటు ఆయన దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో ఆమె నటించారు. అలాగే ఇతర సినిమాలు, సీరియళ్లు కూడా చేశారు. కొంతకాలంగా తెరపై కనిపించడం లేదు. త్వరలో 'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టేజి మీద కనిపించనున్నారు. రాకింగ్ రాకేష్ తన స్కిట్‌లోకి ఆమెను తీసుకొచ్చాడు.
'చాలా రోజుల తర్వాత మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉందమ్మా' అని సుభాషిణితో రోజా చెప్పారు. తర్వాత ఇంతకాలం తాను కనిపించకపోవడానికి కారణం ఏమిటో స్టేజి మీద 'అల్లరి' సుభాషిణి బయట పెట్టారు. తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. 'నేను చచ్చి మళ్లీ బతికాను. నాకు క్యాన్సర్ వచ్చింది' అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతకు ముందు స్కిట్‌లో రాకేష్‌ను రోహిణి కొట్టగా... 'నేను ఇక్కడి నుండి కొడతా' అంటూ రష్మీ అన్నది. 'ఒక్కసారి కొట్టించుకోవా' అని రోహిణి అడుగుతుంది. 'రా కొడతాను' అని రొమాంటిక్‌గా రష్మీ అనడం, వేరే స్కిట్ తరవాత సుధీర్‌ను 'మావయ్య' అని పిలవడం, 'ఢీ'లో ఇటీవల బయటపడిన సాయి-నైనికా రొమాంటిక్ ట్రాక్‌ను కెవ్వు కార్తీక్ స్పూఫ్ చెయ్యడం లేటెస్ట్ ప్రోమోలో హైలైట్ గా నిలిచాయి.