English | Telugu

`తొలిప్రేమ‌` వాసుకీ ఇప్పుడెక్కడ?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన ఎవ‌ర్ గ్రీన్ ల‌వ్‌స్టోరీ `తొలిప్రేమ‌`. ఎ.క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించిన ఈ ప్రేమ‌క‌థ ఇప్పుడు చూసినా అదే ఫ్రెష్ నెస్ క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి చెల్లెలిగా న‌టించి చివ‌రికి ఏజ్ బార్ అయిన వ్య‌క్తిని పెళ్లిచేసుకుని ఏడిపించిన న‌టి వాసుకి గుర్తుందా?.. ఈ మూవీతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆమె ఆ త‌రువాత సినిమాల్లో ఎందుకు క‌నిపించ‌లేదు?.. ఇప్పుడు ఎక్క‌డుంది? ఏం చేస్తోంది? ... ఈమె న‌టించిన `తొలిప్రేమ‌` చిత్రానికి క‌ళాద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆనంద్ సాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ప్ర‌స్తుతం ఈ జంట చాలా హ్యాపీగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా మీడియాకు కూడా క‌నిపించ‌కుండా పోయిన వాసుకి త‌న భ‌ర్త ఆనంద్ సాయితో క‌లిసి `ఆలీతో స‌ర‌దాగా` షోలో ప్ర‌త్య‌క్ష‌మైంది. హాస్య న‌టుడు ఆలీ వ్యా‌ఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో పాల్గొన్న ఆనంద్‌సాయి, వాసుకి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని పంచుకున్నారు.

ఆనంద్‌సాయి, వాసుకిల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు ఎలా చిగురించింది? ..ముందు ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారు? ఆనంద్‌సాయి ఎవ‌రిని దృష్టిలో పెట్టుకుని తాజ్‌మ‌హ‌ల్ సెట్ వేశారు?.. ప‌వ‌న్‌కు ఆనంద్‌సాయికి మ‌ధ్య వున్న అనుబంధం ఏంటీ? ఆనంద్‌సాయి సెట్స్ ల‌లో వాసుకికి న‌చ్చిన సెట్స్ ఏంటీ..? వ‌ంటి ప‌లు విష‌యాల్ని పంచుకున్నారు. సోమ‌వారం ఈటీవిలో ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.