English | Telugu

ఆ పుకార్ల‌తో హార్ట్ బ్రేక్ : స‌మీరా అన్వ‌ర్‌

బుల్లితెర న‌టి, యాంక‌ర్ స‌మీరా అన్వ‌ర్ ప్ర‌ముఖ న‌టి స‌నా త‌న‌యుడు అన్వ‌ర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే పెళ్లికి ముందుకున్న ఎఫైర్‌ల గురించి వీరిద్ద‌రూ ఓపెన్‌గా మాట్లాడుకున్నార‌ట‌. నాగ‌బాబు `అద‌రింది` కామెడీ షోకు కొన్ని నెల‌లు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌మీరా ఆత‌రువాత త‌న‌ని త‌ప్పించ‌డంతో బుల్లితెర‌కు దూర‌మైంది.

అయితే గ‌తంలో త‌నపై పుట్టించిన పుకార్ల‌పై భ‌ర్త అన్వ‌ర్ సాక్షిగా ఇటీవ‌ల ఓ మీడియా కిచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. త‌న‌తో వుంటూ త‌న‌తో న‌టిస్తూ త‌న అనుకున్న వారే వెన‌కాల గోతులు తీసి త‌న‌ని బ్యాడ్ చేశార‌ని వెల్ల‌డించింది. నాతో క‌లిసి సీరియ‌ల్స్‌లో న‌టించిన వారు, నేను సొంత అక్క‌గా భావించిన వాళ్లే నా గురించి బ్యాడ్‌గా చెప్పార‌ని తెలిసి హార్ట్ బ్రేక్ అయినంత ప‌నైంది.

అప్ప‌టి నుంచి ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌య‌మైన వారిని కొలిగ్స్ గానే చూస్తున్నాన‌ని, వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. నా ప‌ని నేను చేసుకుపోతున్నాను. షూటింగ్ పూర్త‌యి ఇంటికి వ‌చ్చాక పోన్ చేస్తే ఎలాంటి వారి ఫోన్ అయినా అటెండ్ చేయ‌ను. సోష‌ల్ మీడియా వేదిగా కూడా స‌హ న‌టీన‌టుల‌తో ఎలాంటి సంభాష‌ణ కానీ చేయ‌ను` అని తెలిపింది స‌మీరా అన్వ‌ర్‌.