English | Telugu

"మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి" అంటూ సుమతో చెప్పిన సల్మాన్

క్యాష్ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ షోకి సీతారామం టీం వచ్చేసింది. దుల్కర్ సల్మాన్, తరుణ్ భాస్కర్, సుమంత్ ఈ షోకి వచ్చేసారు. ఇక సల్మాన్ ని చూసేసరికి ఆడియన్స్ అరుపులు అన్నీ ఇన్ని కావు. అందరి నోళ్లు మూయించి చివరికి నేను మీకు పెద్ద ఫ్యాన్ అని అంటుంది సుమ. అందరూ నవ్వేస్తారు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడ ఎమోజిఎస్ తో ఎక్కువగా మెసేజెస్ చేసేది ఎవరు అని అడుగుతుంది సుమ. సుమంత్ తాను చేస్తానని చెప్తాడు. మనసులో ఏముందో ఎమోజిలో అది కనిపిస్తుందా అని అడుగుతుంది. మనసులో ఏమీ ఉండదు, నా మనసు బండరాయి అంటాడు. తర్వాత సుమన్ ని పక్కకు పిలిచి నిలబెట్టి వెనక స్క్రీన్ మీద మల్లెపూలు ఇమేజ్ ని చూపించి ఆ బొమ్మను అభినయించి చూపించాలని తరుణ్ భాస్కర్ కి చెప్తుంది.

భాస్కర్ కూడా కరెక్ట్ గా చేసి చూపిస్తాడు సుమంత్ మల్లెపూలు అని కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. తర్వాత అలాంటిదే మరో ప్రశ్నకు సల్మాన్ ఆన్సర్ చెప్పేలా చేస్తుంది. తర్వాత సుమ సల్మాన్ ఇద్దరూ కలిసి మహానటిలో ఒక బిట్ డైలాగ్స్ తో ప్లే చేస్తారు. "మనసులో నువ్వే ఉన్నావ్ అమ్మాడి " అనే డైలాగ్ సుమ కోసం సల్మాన్ చెప్పేసరికి సుమ కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత కాష్ ట్రైనింగ్ స్కూల్ కి అందరిని తీసుకెళ్తుంది సుమ. మా స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటే బాగా ఫైట్స్ చేయొచ్చు అని టీమ్ కి చెప్తుంది. అలాగే ఒక ట్రైనర్ ని కూడా చూపిస్తుంది. ఆ తర్వాత ఆడియన్సు నుంచి ఒక అమ్మాయి "ప్రియతమా ప్రియతమా" అంటూ ఒక పాటను సల్మాన్ కోసం పాడుతుంది. ఇక ఈ ఎపిసోడ్ ఈ నెల 30 న ప్రసారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.