English | Telugu
అతను బొమ్మలేస్తే.. ఈమె డాల్గోన కాఫీ చేస్తుంది
Updated : Jul 27, 2022
నిహారిక .. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఆడియన్స్ కి చిరపరిచితమే. బుల్లితెర మీద నటిగా, హోస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. అలాగే నిర్మాతగా కొన్ని వెబ్ సిరీస్ ని కూడా నిర్మించింది. ఒక చిన్న ఫామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ నిర్మించి మంచి మార్క్స్ కొట్టేసింది. కొన్ని మూవీస్ లో కూడా నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో పేరు రాకపోయేసరికి సోషల్ మీడియాలో డిఫరెంట్ షోస్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి నిఖిల్ తో నాటకాలు షోకి వచ్చేసింది. ఇక ఈ షోలో నిహారిక తన భర్త గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. మీ ఆయనలో నువ్ గమనించిన విషయాలు ఏమిటి అని నిఖిల్ అడిగేసరికి తానొక మంచి ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిందని చెప్పింది. నిహారికకు స్టేషనరీ షాప్స్ కి వెళ్లి కాసేపు ఎంజాయ్ చేయడం ఇష్టం.
అదే టైంలో ఒకసారి చైతన్య హెచ్ బి పెన్సిల్స్ ని, స్కెచ్ బుక్స్ ని కొంటూ ఉండడం గమనించాను. హాబీ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నాడేమో పోన్లే అని అనుకున్నా.. కానీ తర్వాత మా ఇంట్లో పెంచుకునే కుక్క బొమ్మ గీసి చూపించేసరికి చాలా షాక్ అయ్యాను. పెళ్లి చూపులప్పుడు నీ గురించి చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. కానీ నేను తర్వాత గుడ్ ఆర్టిస్ట్ అనే విషయాన్ని మాత్రం కనిపెట్టాను. తన హస్బెండ్ లో ఇలాంటి క్వాలిటీ ఉందని చాలా రోజులు తెలుసుకోలేకపోవడం నిజంగా కొంచెం బాదే అని చెప్పింది. తర్వాత చైతన్య వంతు వచ్చేసింది. నిహారికలో మీరు కనిపెట్టిన, ఇష్టమైన అంశాలేమిటి అని నిఖిల్ అడిగేసరికి. నిహారిక డాల్గోన కాఫీ చాలా అద్భుతంగా చేస్తుంది. తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఈమధ్యనే మేమంతా వెళ్ళాం. ఐతే ఒకరోజు మార్నింగ్ నీకు డాల్గోన కాఫీ కావాలా అని నన్ను అడిగింది. ఐతే అది ఎప్పుడు నేను తాగలేదు నాకు అసలు తెలీదు కూడా. కానీ ఆ కాఫీ తాగాక అమేజింగ్ అనిపించింది అంటూ నిహారిక చేసిన కాఫీ గురించి చెప్పేసాడు. ఇక మీ ఇద్దరిదీ ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అని అడిగేసరికి అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ చెప్పారిద్దరూ.