English | Telugu

సదా బెడ్ రూం టూర్ .. సోషల్ మీడియాలో వైరల్!

సదా.. 'జయం' మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఔనన్నా కాదన్నా' తో ఆ సక్సెస్ ని అలాగే కొనసాగించింది సదా.‌ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'నాగ', అల్లరి నరేష్ తో కలిసి 'ప్రాణం', మంచు మనోజ్ తో కలిసి 'దొంగ దొంగది', 'లీలా మహల్ సెంటర్' లాంటి సినిమాలల్లో చేసింది సదా. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడం ఇలా అన్ని భాషల్లో తన సత్తాని చాటుకుంది. అయితే 'అపరిచితుడు' సినిమాతో సదా కెరీర్ పరంగా మంచి హిట్ ని‌ సొంతం చేసుకుంది.

అయితే కొంతకాలం‌ తెలుగు సినిమాలకి దూరంగా ఉంది సదా. ఆ తర్వాత 2016 లో మల్లెమాల ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఢీ డ్యాన్స్ షోకి జడ్జ్ గా చేసింది. అయితే 2018 లో టార్చ్ లైట్ అనే సినిమాలో‌ నటించి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడి తెలుగు డ్యాన్స్ షోకి బడ్జ్ గా చేసింది సదా. ఆ తర్వాత తను ముంబై లో ఒక హోటల్ ని కూడా రన్ చేస్తుంది. అయితే ఆ హోటల్ ఇంకొన్ని రోజుల్లో‌ క్లోజ్ చేస్తామని చెప్పిన సదా.. ఆ హోటల్ కి తనకి ఎంత అటాచ్మెంట్ ఉందో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అక్కడ ఫుడ్ క్వాలిటీగా ఉంటుందని, తను ఆ హోటల్ ని స్టార్ట్ చేసేప్పుడు చాలా కష్టపడిందని వివరించింది.

అయితే సదా వీకెండ్స్ లో, సినిమా షూటింగ్ లేని టైంలో కెమెరా తీసుకొని అడవికి వెళ్ళి ఫోటోలు తీస్తుంది. ఎందుకంటే సదా ఒక ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. తను తీసిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది సదా. అయితే సదా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా రన్ చేస్తోంది. సదా తాజాగా 'బెడ్ రూం టూర్' అని చెప్పి ఒక వీడియోని తన ఫేస్బుక్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. అయితే ఇందులో తన బెడ్ రూంలో లిల్లీ ఫ్లవర్స్ ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండేలా చూసుకుంటుందంట.

ఆ బెడ్ రూంకి వెంటిలేషన్ కోసం ప్రత్యేకించి ఆ రూంని డెకరేడ్ చేసుకుందంట సదా. అలాగే తను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసం తీసుకున్న కెమెరాని చూపించింది సదా. అయితే తన ప్రతీ గదిలోను ఒక పెయింటింగ్ ఉందంట. అలా తన బెడ్ రూం ఎలా ఉంటుందో తెలియజేస్తూ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఫేస్బుక్ లో వైరల్ గా మారింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.