English | Telugu

బెజవాడలో బిజినెస్...సపోర్ట్ చేయాలంటూ ఆది రిక్వెస్ట్

ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడి యుద్ధం చేయాలి అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం బిగ్ బాస్ ఆదిరెడ్డి. బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరికీ గట్టి పోటీ ఇచ్చాడు..అతను కప్పు గెలిచినా గెలవకపోయిన అతని డాన్స్ ఫుల్ ఫేమస్ ఐపోయింది. రీసెంట్ గా సిక్స్త్ సెన్స్ లో కూడా ఓంకార్ ఆది రెడ్డి డాన్స్ స్టైల్ గురించే మాట్లాడారు. అలాంటి ఆదిరెడ్డి ఇప్పుడు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పారు. "మొట్టమొదటిసారిగా విజయవాడలోని అయోధ్యానగర్ లో సెలూన్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను దానికి మీ అందరి సపోర్ట్ కావాలి" అని కోరుతూ ఒక అనౌన్స్మెంట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.

బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పటికి ఒక స్పెషల్ షోగా నిలిచిపోతుంది. ఇందులో కంటెస్టెంట్ గీతూని ఎవరూ మర్చిపోలేరు. ఆమెతో పాటు ఆదిరెడ్డిని కూడా. ఉడాల్ మామగా పేరు తెచ్చుకున్న ఆది యూట్యూబ్ లో రివ్యూస్ చెప్తూ తన జర్నీని స్టార్ట్ చేసి బిగ్ బాస్ లో టాప్ 4 వరకు వెళ్లి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. సెలబ్రిటీస్ చాలా మంది రకరకాల బిజినెస్ లు చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన కామన్ మ్యాన్ సెలబ్రిటీ కూడా ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ చేయడానికి పునాదులు వేసుకుంటున్నాడు. గీతూ రాయల్, ఫైమా, ఆదిరెడ్డి మంచి ఫ్రెండ్స్. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఫైమాకి మంచి ఛాన్సెస్ వచ్చాయి. గీతూ, ఆదిరెడ్డి మాత్రం ఇంకా లైన్ లోకి రాలేదు. మరి ఆది బిజినెస్ సక్సెస్ కావాలని మనం కూడా విష్ చేద్దాం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.