English | Telugu

ఆ బ్యాక్ బెంచ్ అబ్బాయే నా ఫస్ట్ లవ్!

"నీతోనే డాన్స్" షో ఈ వారం మంచి కలర్ ఫుల్ గా జరిగింది. అందరూ మంచి మంచి కాస్ట్యూమ్స్ లో వచ్చి పెర్ఫార్మెన్సులు ఇరగ దీశారు. ప్రపంచంలో ఎప్పుడూ ఎవర్ ఎండింగ్ సబ్జెక్టు లవ్ అని "మూడ్స్ ఆఫ్ లవ్" కాన్సెప్ట్ ఇచ్చింది శ్రీముఖి. ఇక లవ్ అనే మాట వచ్చేసరికి అలనాటి అందాల నటి రాధ తన లైఫ్ లో జరిగిన ఒక మెమరీని అందరితో షేర్ చేసుకున్నారు. "నేను స్కూల్లో చదువుకునేటప్పుడు బ్రేక్ టైంలో ఒక సాంగ్ వచ్చేది.."మేరి సప్పునోమ్ కి రాని కబ్ ఆయే గీతూ" అప్పుడే నాకు హిందీ అంటే చాల ఇష్టం ఏర్పడింది. ఆ బ్రేక్ టైములో నేను రోడ్ క్రాస్ చేసేదాన్ని అక్కడ ఒక ట్యూషన్ సెంటర్ ఉండేది. ఆ ట్యూషన్ సెంటర్ లో బ్యాక్ బెంచ్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అబ్బాయి ఉండేవాడు. ఎప్పుడు ప్రోజ్ చదువుతాడో అప్పుడు తలను కొంచెం పక్కకు తిప్పి చూసేవాడు. అలా రెండేళ్లు సాగింది. ఒక్క మాట లేదు... ఏమీ లేదు..కానీ లవ్ అనే పదం వినిపిస్తే ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఉంటుంది.. మే బి అదే నా లవ్వేమో...ఆ విషయాన్ని మా ఆయనకు చెప్పాను..సర్సర్లే..ఎన్ని సార్లు చెప్తావ్ అని మూతి ముడుచుకున్నారు.. ఎప్పుడు మనసులో ఒక ప్రేమ అనేది ఉండాలి.. అప్పుడు మనం ఎప్పుడూ యంగ్ గానే కనిపిస్తాం" అని ప్రేమ గురించి చెప్పారు రాధ.

డాన్సర్స్ అంతా కాస్ట్యూమ్స్ లో వచ్చేసరికి మీ గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ చూసినవాళ్లు రెస్పాన్స్ ఏమిటి అని అడిగింది శ్రీముఖి. "కావ్య ఫ్రెంచ్ కిస్ గురించి ఏమిటి రెస్పాన్స్" అని అడిగింది. "అమ్మా ప్రోగ్రాం చూస్తున్నావా అనేసరికి హా చూసా చూసా మీ ఫ్రెంచ్ కిస్ చాలా బాగుంది. పాపం అబ్బాయేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే నువ్వెంటి సిగ్గులేకుండా ఫ్రెంచ్ కిస్ అన్నావేంటి" అని అంది మా అమ్మ అని కావ్య చెప్పేసరికి "ఆంటీ వాళ్లింకా పెట్టుకోలేదు ఏం బాగుందని అన్నారు...అత్తమ్మ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి నిఖిలు" అని శ్రీముఖి అనేసరికి "మా అత్తమ్మ ఇంకా నాకు ఫోన్ చేయలేదు" అన్నాడు నిఖిల్. "మీరు ఫిక్స్ అవ్వరు మమ్మల్ని కానివ్వరు..అర్ధమయ్యింది" అని కామెడీ చేసింది శ్రీముఖి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.