English | Telugu
ఆకట్టుకుంటున్న ఉదయభాను కొత్త వ్లాగ్!
Updated : Jun 18, 2023
యాంకర్ ఉదయభాను.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్కప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయినా ఉదయభాను ఉండాల్సిందే. ఏ షో అయినా తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానల్స్ కు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరిసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా కొంత కాలం బుల్లి తెరకి దూరంగా ఉంది.
ఉదయభాను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది.
ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. తాజాగా హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేసిన ఉదయభాను.. ఇప్పుడు తాజాగా ఆదివారమని ఇంట్లోనే చికెన్ చేసింది. 'మై హోమ్ స్టైల్ చికెన్ ఫ్రై' అనే టైటిల్ తో తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా.. ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.