English | Telugu

ఇండ‌స్ట్రీలో తెలుగువాళ్లంటే చిన్నచూపు.. ప్రశాంతి ఆవేద‌న‌!

స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతోన్న 'గృహలక్ష్మి' సీరియల్‌కు మంచి టీఆర్పీ వ‌స్తోంది. ఇందులో లాస్య అనే నెగెటివ్ రోల్‌లో యాంకర్ ప్రశాంతి నటిస్తున్నారు. లాస్య క్యారెక్టర్‌కు ఆమె ఆమె పెర్ఫెక్ట్ గా సూటయ్యిందనే పేరొచ్చింది. ఒకప్పుడు టీవీ ఛానెల్స్‌లో యాంకర్ గా ఆమె సత్తా చూపించారు. తెలుగింటి అమ్మాయి అయిన ప్రశాంతి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడ్డారు.

ఫైనల్‌గా 'గృహలక్ష్మి' సీరియల్ తో నటిగా తనను తాను నిరూపించుకున్న ప్రశాంతి తాజాగా ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు వాళ్లలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారని.. వాళ్లందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యాలే అవుతారని అన్నారు. కానీ అవకాశం లేక చాలా మంది తమ టాలెంట్‌ని చంపుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కొంతమంది అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారని.. ఇవన్నీ ఒక్కోసారి చూస్తుంటే బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. బయట రాష్ట్రాల నుండి తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకే వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారని, కానీ తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరని వాపోయారు. ముందు తెలుగు వాళ్లను ప్రోత్సహించాలని.. చాలా మంది టాలెంటెడ్ వాళ్లు ఉన్నారని ప్ర‌శాంతి అన్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...