English | Telugu

విజ‌య్ ఇంట్లో సుమ కొత్త చాన‌ల్ లాంచ్‌!

బుల్లితెర సెలబ్రిటీలందరూ కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. సొంతంగా ఛాన‌ల్స్ ఓపెన్ చేసి రకరకాల వీడియోలతో తెగ హడావిడి చేస్తున్నారు. దాంతో ఫేమ్ కి ఫేమ్, డబ్బుకి డబ్బు వస్తోంది. అందుకే తారలంతా కూడా యూట్యూబ్ మీద పడ్డారు. తాజాగా సుమ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. నిజానికి ఇప్పటికే సుమక్క పేరుతో ఆమెకి యూట్యూబ్ ఛానల్ ఉంది. కానీ మళ్లీ కొత్త ఛానల్ మొదలుపెట్టింది.

సుమక్క యూట్యూబ్ ఛానల్ ని ఇప్పటివరకు ఏడు లక్షల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఇందులో సుమ దాదాపు డెబ్భై వీడియోలను పోస్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఆ ఛాన‌ల్‌ను ఎందుకో పక్కన పెట్టేసింది. తన పేరు మీదే తాజాగా కొత్త యూట్యూబ్ చానల్‌ మొదలుపెట్టింది. దీనికోసం గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటే అందరూ తన కొడుకు సినిమా గురించి అనుకున్నారు.

కానీ తన కొత్త ఛానల్ ను విజయ్ దేవరకొండతో లాంచ్ చేయించింది సుమ. దీనికోసం విజయ్ ఇంటికి వెళ్లింది సుమ. అక్కడే ఆయనతో కాసేపు ముచ్చట్లు పెట్టింది. విజయ్ తన ఛానల్ లాంచ్ చేయడంతో సుమ చాలా సంతోషపడిపోయింది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తన యూట్యూబ్ ఛానల్ లో దొరుకుతాయని ఆమె చెప్పుకొచ్చింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...