English | Telugu
చీకటి కోణంలో నటి హేమ ఇంటర్వ్యూ!
Updated : Nov 25, 2025
ఫామిలీ స్టార్స్ షోలో సరికొత్తగా ‘చీకటి కోణం’ అనే కాన్సెప్ట్ లో పాగల్ పవిత్ర ఇద్దరిని రోస్ట్ చేసింది. ఈ వీక్ ప్రోమోలో ఇది చూడొచ్చు. షో ప్రోమో లాస్ట్ లో "వర్ష ఇండస్ట్రీలో బాగా సెట్ ఐపోయింది కానీ ఒక లవ్ ట్రాక్ట్ వల్లనే తను సెటిల్ అయ్యిందని చెప్పేసి" అంటూ ఆపేసింది. వర్ష పవిత్ర ముఖం నవ్వుతూ చూస్తూ ఉంది కానీ ఆన్సర్ చెప్పలేదు. ఐతే మొదట్లో ఇమ్మానుయేల్ - వర్ష జోడి బుల్లితెర మీద బాగా హిట్ అయ్యింది. సుధీర్ - రష్మీ జోడిలా. ఇక వర్ష ఐతే కోడలొస్తోందని అత్తగారికి చెప్పు అంది.. అల్లుడొస్తున్నాడు అని మావగారి చెప్పు అంటూ ఇద్దరూ చాలా షోస్ లో లవ్ కాన్సెప్ట్స్ లో స్కిట్స్ కూడా చేశారు. కానీ ఫైనల్ గా ఇద్దరూ విడిపోయారు. ఇమ్మానుయేల్ అటు స్టార్ మాకి వెళ్ళిపోయాడు. అలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక వర్ష ఐతే ఇటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తూ మరో వైపు ఇంటర్వ్యూస్ చేస్తూ వెళ్తోంది. ఎలా ఐతే సుధీర్ - రష్మీ ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారో అన్నట్టు. ఐతే పవిత్ర నటి హేమను కూడా బాగా రోస్ట్ చేసింది. "మీకు సినిమాల్లో గ్యాప్ వచ్చిందా లేకపోతె మీరే తీసుకున్నారా" అంటూ నటి హేమాను అడిగింది పవిత్ర. "ఛిల్ల్ అవుదామని" అని ఫుల్ జోష్ తో చెప్పింది హేమ. "కాంట్రవర్సీతో మీరు రిలేషన్ షిప్ లో ఉంటారు కదా దాని గురించి అడుగుతున్నాను" అని చెప్పేసరికి హేమ ఆన్సర్ ఐతే ఇవ్వలేదు. మరి వీళ్ళు అసలు ఏమని సమాధానాలు చెప్తారో నెక్స్ట్ వీక్ షో టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.