English | Telugu
శ్రీముఖి లేకుండా స్టేజ్ ఎక్కొద్దు.. వార్నింగ్ ఇచ్చిన ప్రభాకర్!
Updated : Oct 12, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో అవార్డు ఫంక్షన్ ఒకటి నిర్వహించారు. ఈ ఎపిసోడ్ కి 'ఇల్లు ఇల్లాలు పిల్లలు', 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్స్ నుంచి నటీనటులు వచ్చారు.
ఇక 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నుంచి రామరాజు- వేదవతికి కలిపి "మిస్టర్ పెళ్ళాం" అనే అవార్డుని ఇచ్చి సన్మానం చేశారు. తర్వాత బాలు-మీనాకి కలిపి "భలే మొగుడు-భలే పెళ్ళాం" పేరుతో శ్రీముఖి వీళ్లకు షాల్ కప్పి ఈ అవార్డుని అందించింది. ఇక నర్మదా-సాగర్ ని పిలిచి "పెళ్ళాం చాటు మొగుడు" అంటూ అవార్డుని అందించింది. తర్వాత మనోజ్-రోహిణిని పిలిచి "పెళ్ళాం చెపితే వినాలి" అనే అవార్డుని అందించింది శ్రీముఖి. ఇక ధీరజ్ - ప్రేమను పిలిచి "మొండి మొగుడు పెంకి పెళ్ళాం" అనే టైటిల్ ని ఇచ్చారు. తర్వాత రవి - శృతికి "మిడిల్ క్లాస్ మొగుడు - హైక్లాస్ పెళ్ళాం" అనే అవార్డు ఇచ్చారు.
ఈ మొత్తం కాన్సెప్ట్ కి యాంకరింగ్ చేశారు హరి - అవినాష్. "యాంకరింగ్ ఇద్దరు చేశారు. వన్ బై వన్ ఇద్దరూ కో-ఆర్డినేటెడ్ గా లైన్స్ చెప్పారు. చాలా వరస్ట్ యాంకరింగ్..గెటౌట్ " అంటూ శ్రీముఖి ఫుల్ క్లాస్ పీకింది. "ఇక పై ఎప్పుడూ కూడా శ్రీముఖి గారు లేకుండా స్టేజి ఎక్కకండి. ఏదో ఒక రోజు తన్నులు తింటారు ఆవిడ లేకపోతే" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్రభాకర్.