English | Telugu

బ్లేడ్‌తో చేతులు కోసుకున్న బ్రహ్మాజీ!

వెన్నెల కిషోర్ ఆధ్వర్యంలో ప్రతీ వారం నవ్వుల్ని పంచుతున్న షో "అలా మొదలయ్యింది"..ఈ షోకి ఇప్పటి వరకు ఎంతో మంది సెలెబ్స్ వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ అతని భార్య శాశ్వతి వచ్చారు. కిషోర్ వీళ్ళను ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు. తానూ తాను భార్యకు ఎలా లవ్ ప్రొపోజ్ చేసాడో చెప్పాడు. "ఇటు పక్క మూన్ లైట్, అటు పక్క సన్ రైజ్ ఆ టైంలో హైస్పీడ్ వాక్ తో అలా నడుచుకుంటూ వెళ్లి ఐ లవ్ యు చెప్పేసాను. అలాగే తన బర్త్ డేకి నా చైన్ తాకట్టు పెట్టాను." అని చెప్పారు బ్రహ్మాజీ.

తమ ప్రేమ పెళ్లికి డైరెక్టర్ కృష్ణవంశీ కారణం అని ..ఆయనే కన్యాదానం చేసినట్లు బ్రహ్మాజీ - శాశ్వతి చెప్పారు. " మీరు ఫోన్ లో మాట్లాడుకున్న సమయం ఎంత" అని కిషోర్ అడిగేసరికి " ప్రేమలో ఉన్నప్పుడు పబ్లిక్ బూత్‌ల దగ్గరే సమయమంతా గడిపే వాడినని" బ్రహ్మాజీ చెప్పారు. "మీకో సీక్రెట్ చెప్తానంటూ శాశ్వతి బ్రహ్మాజీ చెయ్యి తీసుకుని చూపించింది. ఆ చెయ్యి మీద ఒక బ్లేడ్ తీసుకుని చాలా పొడవుగా కట్ చేసేసుకున్నాడు..నేనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చింది " అని చెప్పి చూపించింది. "నాయనా నువ్వు ఇంత వయొలెంట్ ఏమిటి అని అడిగాడు" కిషోర్. "మేడం తిట్టేటప్పుడు మీరు వింటారా" అనేసరికి "బైక్ స్టార్ట్ అవగానే నేను కార్ తీసుకుని వెళ్ళిపోతాను" అని చెప్పాడు. "ఈరోజు నేను మీలో ఒక సద్గురుని చూస్తున్నా" అన్నాడు కిషోర్. "కుక్కపిల్లకు బిస్కెట్ వేసి దా దా అంటే ఎలా ఫాలో అవుతుందో నేను అలాగే ఫాలో ఐపొతూ వెళ్తాను" అని చెప్పాడు. "నీకు శాశ్వతికి చాలా హ్యాపీగా ఉంది కదా నన్ను తిడుతూ ఉంటే అని కొంచెం ఫీలయ్యాడు బ్రహ్మాజీ. నిన్ను ఒక్కసారి తిడితే మళ్ళీ మూడు రోజులు భోజనం చెయ్యవు" అని అన్నాడు. మే 2న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. బ్రహ్మాజీ బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బ్రహ్మాజీ గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి మూవీస్ తో కెరీర్ స్టార్ట్ చేసి మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత పదేళ్లపాటు ఎన్నో రకాల క్యారెక్టర్స్ లో చేసాడు. ఇప్పుడు మాత్రం కమెడియన్ గా, సహాయ నటుడిగా, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్ లో నటిస్తున్నాడు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.