Read more!

English | Telugu

ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు శివయ్య నీకు ధన్యవాదాలు

శివజ్యోతి రీసెంట్ గా మ్యారేజ్ డే సెలెబ్రేట్ చేసుకుంది. సావిత్రిగా పేరు తెచ్చుకున్న శివ జ్యోతి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. శివజ్యోతి న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఐతే అప్పటివరకు ఎవరికీ తెలియని శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక అందరికీ ఫ్యాన్ ఐపోయింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అలాంటి శివజ్యోతి చాలా చిన్న వయసులోనే గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి ఇంట్లో చాలా గొడవలు కూడాయ్యాయని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఐతే పెళ్లి చేసుకున్న సమయంలో తినడానికి తిండి లేక చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని గురించి చెప్పింది. కానీ ఇప్పుడు ఈ జంట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి శివజ్యోతి తన పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకుంది..రకరకాల ప్లేసెస్ కి ట్రిప్ కి వెళ్లారు ఈ జంట.

 అలా ఇషా యోగాకి వెళ్లి అక్కడ శివయ్య సన్నిధిలో ఈ జంట నిలబడి ఆ దేవుడిని దర్శించుకున్నారు. ‘ఇంత మంచి మొగోని ఇచ్చినందుకు శివయ్యకు మా పెళ్లి రోజుకి విష్ చెప్పిన  మీకు ధన్యవాదాలు’ అంటూ అక్కడ దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అలా ఊటీ కూడా వెళ్లి అక్కడ రోజ్ గార్డెన్ ని కూడా చూసి ఎంజాయ్ చేసింది శివజ్యోతి. శివ జ్యోతి గంగూలితో కలిసి ఎన్నో షోస్ లో  సందడి చేసింది. ఇష్మార్ట్ జోడి ప్రోగ్రాంతో ఈ జంట ఫుల్ ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక శివజ్యోతి ఆ  క్రేజ్‌ను బాగానే వాడుకుంది. అలాగే సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ.. తన ఫాన్స్ కి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ యాక్టివ్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె ప్రతీ విషయానికి ఏడుస్తూనే ఉండేది. అందుకే ఆమెకు  పాతాళ గంగ అని పేరొచ్చింది. . ఫైనల్ గా ఆమె  ఏడుపు మొహాన్ని చూడలేకే జనాలు ఎలిమినేట్ చేసేశారు.