English | Telugu

Eto vellipoindhi manasu : చావుబతుకల మధ్య భర్త.. ఆమె కోరిక‌నెరవేరుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు(Eto Vellipoindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-206 లో.‌. యాగం చేస్తున్న సీతాకాంత్ కి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. ‌ఇక రామలక్ష్మి చూసి తన మనసులోని మాట చెప్తుంది. ఇప్పుడు కూడా నా మనసులోని మాట చెప్పకపోతే నేనెందుకు అని అనుకున్న రామలక్ష్మి.. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అండి.‌ ఈ జన్మకే కాదు జన్మజన్మలకి మిమ్మల్నే ప్రేమిస్తున్నాను మీరే నా భర్తగా రావలాని రామలక్ష్మి చెప్పగానే సీతాకాంత్ హ్యాపీగా నవ్వేస్తాడు.

ఇక సీతాకాంత్ అలాగే పడిపోతాడు. రామలక్ష్మి, మాణిక్యం వాళ్ళు సీతాకాంత్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ ని తన భర్తని కాపాడమని రామలక్ష్మి ప్రాధేయపడుతుంది. అది చూస్తే గానీ అర్థం కాదని డాక్టర్ చెప్తాడు. ఇక బయట ఉన్న మాణిక్యంతో రామలక్ష్మి మాట్లాడుతుంది. నాన్న ఆయనకు ఇలా అవ్వడానికి కారణం నువ్వే‌..‌ఆయనతోనే ఉండన్నాను కదా.. కంటికి రెప్పలా చూడమన్నా కదా అని ఏడుస్తుంది రామలక్ష్మి. అవును అమ్మ.. సీతాకాంత్ నన్ను రావొద్దన్నాడు. నీ మాట కాదని అల్లుడి మాట విన్నందుకే ఇలా జరిగిందని మాణిక్యం ఎమోషనల్ అవుతాడు. అదే సమయంలో శ్రీలత వచ్చి.. నువ్వు సీతని పెళ్ళి చేసుకున్నప్పటి నుండే శని పట్టుకుంది. నువ్వు సీతకి పట్టిన దారిద్రం అని శ్రీలత అనగానే.. రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది.‌ ఆపుతావా చెల్లెమ్మ.. మాటలు మంచిగా రానివ్వు.. నీలా ఆలోచించే బుద్ధి నా కూతురికి లేదు. తను అహర్నిశలు సీతాకాంత్ కోసమే కష్టపడుతుందని శ్రీలత మీద మాణిక్యం కోప్పడుతాడు. ఇక పెద్దాయన ఉండి.. లోపల సీతాకాంత్ ఉంటే బయట మీరేం మాట్లాడుతున్నారని అనగానే ఇద్దరు సైలెంట్ అవుతారు. ఆ తర్వాత రామలక్ష్మి దేవుడిని వేడుకుంటుంది. యాగం దగ్గర అమ్మవారి కోసం ఉంచిన అక్షింతలు, కుంకమ గుర్తొచ్చి అక్కడికి వెళ్తుంది రామలక్ష్మి. అదేసమయంలో అక్కడికి నందిని వస్తుంది. యాగం జరిగే ప్లేస్ లో ఎవరు లేకపోవడంతో అక్కడే ఉన్న పంతులిని.. సీతాకాంత్, రామలక్ష్మి వాళ్ళు యాగం చేస్తున్నారని చెప్పారు.. ఎవరు లేరేంటని అడుగగా.. సీతాకాంత్ చావుబతుకుల మధ్య ఉన్నాడని, జరిగిందంతా నందినికి అతను చెప్తాడు. ఇక సీతాకాంత్ కి ఏమవుతుందోనని నందిని ఏడుస్తుంటుంది. అప్పుడే రామలక్ష్మి రావడం గమనించి చాటుగా దాక్కుంటుంది.

రామలక్ష్మి తన భర్త బాగుండాలని అమ్మవారిని వేడుకుంటుంది. నా వల్లే ఆయనకి అలా అవుతుందంటే , నా భర్త లైఫ్ నుండి నేను వెళ్ళిపోతాను అని‌ అమ్మవారికి చెప్పుకుంటూ ఏడుస్తుంటే తనని చూసి నందిని ఆలోచనలో పడుతుంది. ఇక ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసిన కుంకుమ, అక్షింతలని రామలక్ష్మి తీసుకొని వెళ్ళి సీతాకాంత్ కి కుంకుమ పెడుతుంది. కాసేపటికి డాక్టర్ బయటకి వచ్చి.. ఆపరేషన్ చేశాం కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.