English | Telugu

స్టార్ మా పరివారం కొత్త లుక్ తో స్టార్ వార్స్ గా

ఆదివారం అంటే చాలు వారం మొత్తంలో హ్యాపీగా రెస్ట్ తీసుకునే ఒక రోజు. మరి అలాంటి రోజున వచ్చే షోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తే వచ్చే ఎనెర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. మరి అలాంటి సండే రోజున మన కోసం మరింత కొత్తగా షోస్ ని రూపొందిస్తున్నారు మేకర్స్.అందుకే బుల్లితెర మీద ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో కొత్త అవతారం ఎత్తబోతోంది. అందులో భాగంగానే "ఆదివారం విత్ స్టార్ మా" కొత్త లుక్ లో కనిపిస్తోంది. "ఎంటర్టైన్మెంట్ లో మా పరివారం కొత్త అవతారం ఎత్తబోతోంది. అదే స్టార్ వార్" అని అనౌన్స్ చేసింది శ్రీముఖి. ఇక ఇందులో పార్టిసిపెంట్స్ కి కొత్త కొత్త ఛాలెంజెస్ ఇచ్చింది.

ఒక వ్యక్తి ఒంటి కాలు మీద నిలబడితే ఇంకో వ్యక్తి కళ్ళకు గంతలు కట్టుకుని ఆ కాలు ఎవరిదో కనిపెట్టడం , స్పీడ్ గా బత్తాయిల నుంచి ఎవరు రసం తీస్తారు ? అనే కొత్త కొత్త ఆటలు అలాగే లేడీస్ అందరినీ వరసగా కూర్చోబెట్టి ఒకరి జడలు ఒకరు వేసుకునేలా , బెలూన్స్ ని ఎవరు స్పీడ్ గా ఊదుతారో ? అంటూ ఇలా రకరకాల టాస్కులు ఇచ్చింది. "బిగ్ బాస్ లా ఉంటుంది ఎలిమినేషన్ , ఎక్కడున్నా ఈ అత్తలదే డామినేషన్" అని నటి రాశి ఒక రేంజ్ లో డైలాగ్ చెప్పింది.

ఇందులో డాన్సులు, మ్యాజిక్ షో ఇలా చాలా ఎలిమెంట్స్ తో నెక్స్ట్ వీక్ నుంచి మరింత జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఈ షో రాబోతోంది. "చూస్తారుగా ఈ శ్రీముఖి ఆడించే ఆట" అంటూ శ్రీముఖి చెప్పిన డైలాగ్ వేరే లెవెల్ లో ఉంది. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి రేంజ్ లో నటుడి శివ్ డైలాగ్ చెప్పేసరికి అందరూ గట్టిగా అరిచేసారు. మరి ఇంతకు ఈ షోలో కనిపించబోతున్న కొత్త గేమ్స్ ఏమిటి ఇంకా ఈ షోలో ఎలాంటి కంటెంట్ ఉండబోతోంది అనే విషయం తెలియాలి అంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.