English | Telugu

మండిపోతున్న ఎండలకు కారణం ప్రతిపక్షాలు


డ్రామా జూనియర్స్ సీజన్ 6 గత వారం లాంచింగ్ ఎపిసోడ్ 1 అయ్యాకా ఈ వారం లాంచింగ్ ఎపిసోడ్ 2 ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. డ్రామా జూనియర్స్ రోల్ నంబర్ 10 లో రాజమండ్రి నుంచి 11 ఏళ్ళ వయసున్న కుర్రాడు లోకేష్ వచ్చి అందరినీ అద్భుతంగా కడుపుబ్బా నవ్వించాడు. "సుత్తి ఛానల్ విత్ కత్తి" అనే లోగోతో న్యూస్ రీడర్ గా ఎన్నో పాత్రలు పోషించి ఒక వెరైటీ స్కిట్ ని పెర్ఫార్మ్ చేసాడు. తన స్కిట్ లో అన్ని రోల్స్ తానే పెర్ఫార్మ్ చేసేసాడు. బ్రేకింగ్ న్యూస్ హెడ్ లైన్స్ చదువుతూ మంచి ఫన్ క్రియేట్ చేసాడు. " రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ..తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోలేక తికమక పడుతున్న బిచ్చగాళ్ళు" అనేసరికి జడ్జెస్ అంతా నవ్వేశారు.

అసలే రాష్ట్రంలో ఎండ వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా ఎక్కువగా ఉంది. ఇలాంటి టైములో లోకేష్ చదివిన రాజకీయ వార్తలు మంచి ఫన్నీగా ఉన్నాయి. "ప్రియమైన ప్రజలారా మీకు తెలుసు నాకు ఇష్టమైనది చేపల పులుసు ..ప్రజలారా ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే టిఫన్ లోకి రెండో సారి చట్నీ అడగలేని దుస్థితిలో ఉన్నాం ...ఇదంతా ఎవరి వల్ల...ప్రతిపక్షాల వల్ల" "ఈ రోజు ఎండలు ఇంతగా మండిపోతున్నాయి అంటే కారణం ఎవరు...ప్రతిపక్షాలు " "అదే నన్ను గెలిపిస్తే ఎండాకాలంలో ఎండని, వర్షాకాలంలో వర్షాన్ని, చలికాలంలో చలిని టైంకి తీసుకొస్తానని మీ అందరి మీద ప్రమాణం చేస్తున్నాను" అంటూ ఒక రేంజ్ డైలాగ్ చెప్పేసరికి ప్రదీప్ మొహం వెరైటీగా ఐపోయింది. ఇక వాతారణం వార్తలు, మధ్యలో యాడ్స్ అన్ని వెర్షన్స్ లో సింగల్ హ్యాండ్ తో స్కిట్ ని పెర్ఫార్మ్ చేసి అందరినీ నవ్వించేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.