English | Telugu
మురారి డైరీని చదివి నిజం తెలుసుకున్న ముకుంద!
Updated : Jun 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -188 లో.. మురారి తనని మర్చిపోయిన విషయం తెలిసి సూసైడ్ చేసుకోవాలని కొండ పైకి వెళ్తుంది. మళ్ళీ తనకి తాను సర్దిచెప్పుకుంటుంది. కృష్ణ ఎలాగూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారి నేను ఉండొచ్చు అనుకుని ఎలాగైనా మురారి ప్రేమని ఏం చేసైనా సరే దక్కించుకుంటానని ముకుంద అనుకుంటుంది.
మరొక వైపు కృష్ణ మురారి రెస్టారెంట్ నుండి బయటకు వస్తారు. అప్పుడే ఒక ఛానల్ వాళ్ళు వచ్చి కృష్ణ, మురారీలను కొన్ని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడతారు. ప్రేమ గొప్పదా? పెళ్లి గొప్పదా? అని మీడియా వాళ్ళు అడుగుతారు. మొదటగా కృష్ణ ని అడుగగా.. నా దృష్టిలో ప్రేమ గొప్పది ఎందుకంటే మనసుకు ఇష్టం లేకుండా ఒక మనిషితో ఉండడం కష్టం అదే లవ్ లో ఇద్దరు ఒకరికొకరు తెలుసుకొని ఒక అండర్ స్టాండింగ్ ఉంటుంది. బలవంతపు పెళ్లిలో ప్రేమ ఉండదని కృష్ణ అనగానే.. బలవంతపు పెళ్లి అంటుందేంటి మా ఇద్దరి గురించేనా అంటుందని, నేను ఇష్టం లేనని కృష్ణ చెప్తుందా అని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ గొప్పదా? పెళ్లి గొప్పదా అని మురారిని అడుగగా.. పెళ్లి గొప్పదని చెప్తాడు. ప్రేమ ఇద్దరికి సంబంధించినది.. పెళ్లి అలా కాదు.. రెండు కుటుంబాలకు సంబంధించినదని పెళ్లి గురించి మురారి పాజిటివ్ గా చెప్పేసరికి.. ఏంటి ఏసీపీ సర్ పెళ్లి గురించి ఇలా చెప్తున్నాడు.. డైరీ అమ్మాయి గురించి చెప్పట్లేదని కృష్ణ అనుకుంటుంది. ఏ విషయం గురించి క్లారిటీ చెప్పట్లేదని కృష్ణ అనుకుంటుంది. ఏంటి కృష్ణ బలవంతపు పెళ్లి అంటున్నావ్. మన పెళ్లి గురించి అంటున్నావా అని మురారి అడుగుతాడు. లేదు మన పెళ్లి మా నాన్న ఇష్టంతో చేశారని కృష్ణ అంటుంది.
మరొక వైపు ముకుంద ఇంటికి వస్తుంది. మురారి డైరీ చదువుతుంది. మురారి డైరీలో మొదటి కొన్ని పేజెస్ ముకుంద గురించి తన పరిచయం ప్రేమ గురించి రాసినవి చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని కృష్ణ అంటే ఇష్టం అంటున్నావా అని మురిసిపోతుంది. ఆ తర్వాత కొన్ని పేజెస్ చదువుతుంది. అందులో కృష్ణ గురించి కృష్ణని ప్రేమిస్తున్న విషయం రాసి ఉన్నది ముకుంద చదివి షాక్ అవుతుంది. మోసగాడా? చీటర్ అంటూ మురారిని తిడుతు ఎమోషనల్ అవుతుంది ముకుంద. మరొక వైపు కృష్ణకి ఐస్ క్రీం కొనివ్వడానికి మురారి తనని బయటకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగలిసిందే.