English | Telugu
విహారికకు రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసిన ఆది..
Updated : Nov 3, 2023
ఈ వారం ఢీ షో ఆది కామెడీ డైలాగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేసింది. ఆది ఎప్పుడూ ఎవరో ఒకరిని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఈసారి ఒక అమ్మాయికి ప్రొపోజ్ చేసాడు. ఆ అమ్మాయి పేరు విహారిక ఇంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఆది అంటే ఇష్టం అని ఆ అమ్మాయి చెప్పింది. ఇక ఈ వారం ఢీ షోలో "ఆదిని ఎం చూసి ప్రేమించారు" అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "ఆది చాలా మంచోడు" అని చెప్పింది విహారిక. ఆతర్వాత ముద్దు కూడా పెట్టేసింది.
"ఏదో పెద్దాయన అని ముద్దు పెట్టారా" అని శేఖర్ మాస్టర్ డైలాగ్ వేసేసరికి ఆది కొంచెం హర్ట్ అయ్యాడు. "మా పెళ్ళికి మీరు అస్సలు రాకండి..మా పెళ్లి మేమె చేసుకుంటాం" అన్నాడు ఆది. "పెళ్లి పెద్దలుగా వస్తాం...ఐనా ఆది చాలా మంచోడు, చాలా మంచి మనసు, ఆది నవ్వితే చాలా అందంగా ఉంటాడు" అని శేఖర్ మాస్టర్ ఆదిని పొగిడేసరికి "వద్దు బాబోయ్ మీరు తేనే పూసిన కత్తి..మీరు నాకు గురించి ఇంత మంచి చెప్పాల్సిన అవసరమే లేదు..16 సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నా " అన్నాడు ఆది.. ఇక తన లవర్ విహారికను స్టేజి మీద రెడ్ రోజ్ ఇచ్చి సింగల్ లెగ్ మీద కూర్చుని ప్రొపోజ్ చేసాడు. ఇక విహారిక కూడా "ఐ లవ్ యు టూ" అని రివర్స్ లో చెప్పేసింది. తర్వాత "చూపే బంగారమాయెరా" సాంగ్ కి డాన్స్ చేసాడు ఆది. అది చూసిన శేఖర్ మాస్టర్ "మీ జంట చూడముచ్చటగా ఉంది" అన్నాడు ఇక ప్రదీప్ మధ్యలో వచ్చి "తప్పేముంది పెద్దాయన కూడా ఒక తోడు కోరుకుంటున్నాడు అందులో తప్పేముంది" అని కౌంటర్ వేసాడు.