English | Telugu

Guppedantha Manasu:భర్త కోసం అర్థరాత్రి బయటకొచ్చిన భార్య.‌. తన ఆచూకీ తెలిసేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -949 లో. రిషి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని వసుధార కంగారు పడుతుంది. ఆ విషయం తెలియని అనుపమ.. మహేంద్ర ని తన మాటలతో చిరాకు తెప్పిస్తుంది.‌ ఇలాంటి పరిస్థితులలో జగతి ఉంటే రిషిని అలా బయటకు పంపించేది కాదంటు మాట్లాడుతుంది.

ఆ తర్వాత ఎప్పుడు దైర్యంగా ఉంటావ్ నువ్వు. నిన్ను ఇలా ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. రిషి వస్తాడు నువ్వు ఏం టెన్షన్ పడకని వసుధారకి అనుపమ దైర్యం చెప్తుంది. వసుధార చూడు ఎంత బాధపడుతుంది? నీలో ఎలాంటి రియాక్షన్ లేదని అనుపమ అనగానే తనపై మహేంద్ర సీరియస్ అవుతాడు. నేను పడే బాధ నీకేం తెలుసని మహేంద్ర అనగానే.. బాధపడే వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంటారా? వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని అనుపమ అనగానే.. ఈ రోజు నుండే కాదా రిషి కన్పించట్లేదు? రేపటి వరకు చూసి కంప్లైంట్ ఇస్తానని మహేంద్ర అంటాడు. మరొక వైపు ధరణికి వసుధార కాల్ చేసి.. రిషి వచ్చాడా అని అడుగుతుంది. రాలేదని‌ ధరణి చెప్పగానే.. వసుధార ఇంకాస్త టెన్షన్ పడుతుంది. మరొకవైపు అనుపమ తనకి తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి.. రిషి గురించి కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత అనుపమ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఫణీంద్ర దగ్గరికి దేవయాని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారని అనగానే ముకుల్ వినిపించిన వాయిస్ రికార్డు గురించి.. అందులో వాయిస్ శైలేంద్రది అనగానే.. అంటే మీరు మన కొడుకుని అనుమానిస్తున్నారా అని దేవయాని అంటుంది. అనుమానం కాదు సాక్ష్యం ఉందని ఫణీంద్ర అంటాడు.

ఆ తర్వాత ఫణీంద్ర దగ్గరికి ధరణి వచ్చి.. రిషి ఇంకా ఇంటికి వెళ్లలేదట.. ఇందాక వసుధార ఫోన్ చేసి టెన్షన్ పడుతుందని చెప్తుంది. ఫణింద్ర వెంటనే మహేంద్రకి ఫోన్ చేస్తాడు. రిషి గురించి కనుక్కోమని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వసుధార ఎక్కడ కన్పించక పోవడంతో మహేంద్ర కంగారుపడుతుంటాడు. అప్పుడే అనుపమ వచ్చి.. ఏమైందని అడుగుతుంది. వసుధార కన్పించడం లేదని అనగానే.. ఒకసారి ఫోన్ చేసి చూడు అని అనుపమ అంటుంది. ఆ తర్వాత వసుధారకి మహేంద్ర ఫోన్ చేస్తాడు. రాత్రి బయటకు వచ్చాను.. రిషిని వెతుక్కుంటు వచ్చానని వసుధార చెప్తుంది.. ఆ తర్వాత మహేంద్ర రిషి కన్పించడం లేదు అన్న విషయం ముకుల్ కి ఫోన్ చేసి చెప్తాడు. మరొకవైపు కాలేజీ లో తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.