English | Telugu
ప్రదీప్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అంటున్న ఆమని
Updated : Sep 9, 2022
జీ తెలుగులో ఎన్నో షోస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి ప్రతీ వారం. ఇక ఇప్పుడు జీ తెలుగు సూపర్ ఫామిలీ సీజన్ 1 గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ ఐపోయింది. ఇప్పుడు దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాలుగు సీరియల్స్ యాక్టర్స్ పోటీ పడ్డారు. కల్యాణ వైభోగం టీమ్ vs అగ్ని పరీక్ష టీమ్, ముత్యమంతా ముద్దు vs గుండమ్మ కథ టీమ్ మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ జరిగింది.
ఇక మేఘన లోకేష్ ముసలమ్మ వేషంలో ఎంట్రీ ఇచ్చేసరికి " ఏమిటి పెద్దమ్మ .. మీ ఒరిజినల్ క్యారెక్టర్ లో ఈ షోకి వచ్చారు అంటూ కౌంటర్ వేసాడు ప్రదీప్. అసలు ఈ షోకి మీకు ఏం చెప్పి తీసుకొచ్చారు అనేసరికి మిమ్మల్ని చూసే అవకాశం అప్పుడప్పుడే దొరుకుతుంది కదా అందుకే పిలవగానే వచ్చేసా" అంటుంది మేఘన లోకేష్.
ఇక ఈ షోకి గెస్ట్ గా సినీ యాక్టర్ ఆమని వచ్చింది. అప్పుడు ప్రదీప్ ఈ టీమ్స్ లోని యాక్టర్స్ ని చూపించి వాళ్ళ టాలెంట్ కి తగ్గట్టు మూవీ టైటిల్ ఇవ్వండి అని అడిగాడు. "సిద్దార్ధ్ వర్మని చూసిన ఆమని సిసింద్రీ అంటూ మూవీ టైటిల్ ఇస్తుంది. ప్రదీప్ కి ఒక మూవీ టైటిల్ ఇవ్వండి అని ఒక సీరియల్ యాక్టర్ అడిగేసరికి మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ "అంటూ ఆమని సినిమా టైటిల్ ఇచ్చేస్తుంది. ఇక అలా మొదలయ్యింది సినిమాలో ఫుల్ ఎంటర్టైన్ చేసిన స్నిగ్ద ఈ షోకి వచ్చి తన సింగింగ్ టాలెంట్ ని పరిచయం చేసింది. కొన్ని పాటలు పాడింది. ఇక ఈ షోలో పోటీ పడిన నాలుగు టీమ్స్ లో ఏ టీమ్ టైటిల్ విన్ అయ్యిందో తెలుసుకోవాలంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆగాల్సిందే.