English | Telugu
శ్రద్దా చాలా హాట్ అంటున్న జానీ మాస్టర్
Updated : Sep 9, 2022
ఢీ సీజన్ 14 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, హీరోయిన్ శ్రద్దాదాస్ జడ్జెస్ గా వచ్చారు. ఈ షోలో హైపర్ ఆది కామెడీ కామన్ అనే విషయం అందరికీ తెలుసు. ఆది పక్కనే ఉన్న అఖిల్ ని ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లయ్యిందని అడిగాడు. పదేళ్లు అయ్యింది అని అఖిల్ అనేసరికి ఎంత సంపాయించావ్ అని మళ్ళీ ఆది అడుగుతాడు. బానే సంపాయించా అన్నాడు. "అసలు ఏమీ చేయకుండానే ఇంత సంపాదించావంటే, ఏమన్నా చేసుంటే ఇంకెంత సంపాదించేవాడివో" అంటూ పంచ్ వేశాడు. దానికి అందరూ గట్టిగా నవ్వేశారు.
అనంతరం జడ్జి శ్రద్దాని ఆది ఒక క్వశ్చన్ అడిగాడు. "గణేష్, జానీ మాస్టర్స్ ఇద్దరిలో ఎవరు నాటీ? ఎవరు స్వీటీ? అని అడిగాడు. జానీ మాస్టర్ నాటీ.. గణేష్ మాస్టర్ స్వీటీ అని శ్రద్దా ఆన్సర్ ఇచ్చింది. పక్కన కూర్చుని ఎంత ఇబ్బంది పెట్టకపోతే అలా మాట్లాడుతుంది చెప్పు అని ఆది అన్నాడు. తర్వాత శ్రద్దా జానీ మాస్టర్ ఇవాళ నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పేసరికి.. ఏమన్నాడని ఆది చాలా ఇంటరెస్టింగ్ గా అడిగాడు. నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్ అన్నాడు.. అని చెప్పడంతో ఆది సడెన్ గా కూర్చున్నవాడల్లా లేచి నిలబడి నాకు తెలిసి పశుపతి కూడా అరుంధతిని కొంచెమే ఇబ్బంది పెట్టుంటాడు. జానీ మాస్టర్ మాత్రం... బాబోయ్ అంటూ అతనికి ఆది దణ్ణం పెట్టేస్తాడు. ఆది పంచ్ కి అందరూ గట్టిగా నవ్వేశారు. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.