English | Telugu

అసలు బ్యాంకాక్ ట్రిప్ లో ఏం జరిగిందంటే!

సెలబ్రిటీలకి ఉండే క్రేజే వేరు. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సెలబ్రిటీకీ అయిన ఏదైనా ప్రదేశానికి వెళ్తే విఐపీ ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ఇనయా సుల్తానా తాజాగా బ్యాంకాక్ వెళ్ళి వచ్చింది. అయితే తను వెళ్ళే ప్రయాణంలో ఏం జరిగిందో వివరించింది ఇనయా సుల్తానా. ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా ఫాలోయింగ్ బాగానే ఉంది.

బాస్ సీజన్-6 తో ఫేమస్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పి‌న ఇనయా‌‌.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది.

కాగా రెగ్యులర్ గా తన ఫోటోలని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది ఇనయా. ఎప్పటికప్పుడు కొత్త ప్రయాణాలు, కొత్త ఫోటోలతో ట్రెండింగ్ లో ఉంటుంది ఇనయా. కాగా బ్యాంకాక్ వెళ్ళి అక్కడ జల్సా చేసి వచ్చింది ఇనయా. అదంతా ఒక వ్లాగ్ లో చెప్పింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ లో తనని సెలబ్రిటీగా గుర్తించిన విమానాశ్రయంంలోని ఒక మేనేజర్.. ఇనయాకి సెలబ్రిటీ హాదాని కల్పించి తన ప్రయాణానాన్ని సులభంగా చేసాడంట. ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళి, అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసి హోటల్ రూమ్ కి వెళ్ళింది. అక్కడ తను స్ట్రీట్ షాపింగ్ లో కొన్న రకరకాల డ్రెస్ లని వేసుకొని చూపించి, ఈ డ్రెస్ లలో మీకు ఏవి నచ్చాయో కామెంట్ చేయమని ఇనయా అంది. అలాగే అక్కడి నుండి పటాయా బీచ్ కి ట్యాక్సీ లో వెళ్ళినట్టుగా చెప్పింది. అక్కడ సరదాగా తనకిష్టమైన పనులు చేస్తుంది ఇనయా. పటాయా బీచ్ లోని సముద్రం, బీచ్, అక్కడ ఫ్రూట్ షాప్ లో తనకెంతగానే ఇష్టపమైన మామిడిపండ్లను చూస్తూ మురిసిపోయింది‌‌. ఇలా బ్యాంకాక్ ట్రిప్ జరిగిందంటూ ఇనయా తన వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.