English | Telugu

మా కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం!

శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది.

తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది.

శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి, గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. అయితే తన యూట్యూబ్ ఛానెల్ లో 'పెద్దమ్మ తల్లికి యాటను కోసినం' అనే వ్లాగ్ వైరల్ అయింది. తాజాగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం.. ఇలా జరుగుతుంటు శివజ్యోతి‌ వ్లాగ్ చేసింది. ఇందులో బుల్లితెర నటీ నటులు తమ తన భర్తలతో వచ్చి సర్ ప్రైజ్ చేసారు‌. కాగా వచ్చిన ప్రతీ ఒక్కరి కాళ్ళకి పసుపు రాసి, మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంది శివజ్యోతి‌. అలాగే కొత్త కొత్త రీల్స్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా
ఉంటుంది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.