English | Telugu

ఈటీవీలో త్వరలో  తులసి పేరుతో ఒక కొత్త సీరియల్

ఈటీవీలో త్వరలో "తులసి" పేరుతో ఒక కొత్త సీరియల్ పట్టాలెక్కబోతోంది. ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ గా యమునా నటిస్తున్నారు. యమునా ఈ సీరియల్ టైటిల్ "తులసి" పేరుతో లీడ్ రోల్ లో నటించబోతున్నారు. ఈటీవీలో ఒకప్పుడు యమునా సీరియల్స్ సూపర్ డూపర్ హిట్టయినవి ఎన్నో ఉన్నాయి. "అన్వేషిత, విధి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మౌనపోరాటం" వంటి సీరియల్స్ లోని పాత్రలకు ఆమె ప్రాణం పోశారు. అలాగే ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది. ఐశ్వర్య గతంలో "కృష్ణ తులసి" సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ బాగా పరిచయమే. అందులో "శ్యామా" రోల్ ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇక ఇప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే ఈ "తులసి" సీరియల్ ద్వారా కనిపించబోతోంది. ఇక ఈ సీరియల్ లో మానస నటిస్తోంది..ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ లో నటించింది. అలాగే జెమినీ టీవీ యాంకర్ సురేష్ కూడా ఈ తులసి సీరియల్ లో నటించబోతున్నారు. ఈయన గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కన్యాదానం సీరియల్స్ లో నటించారు. అలాగే "నువ్వు నేను ప్రేమ" సీరియల్ లో నటించిన విహారికా కూడా కనిపించబోతోంది. యమునాని ఫేమస్ డైరెక్టర్ కె.బాలచందర్ చూసి.. సుహాసిని నటించిన "సిస్టర్ నందిని" మూవీలో సుహాసినికి చెల్లెలి పాత్రలో నటించడానికి అడిగారు.

యమునా తల్లి ఓకే అని చెప్పినప్పటికీ, యమునకు నటన మీద అప్పటికి పెద్దగా ఆసక్తి లేదు.. కానీ డైరెక్టర్ కు నో చెప్పే ధైర్యం లేక , తప్పని పరిస్థితులలో షూటింగ్ హాజరైంది. ఇక ఈ మూవీలో చేసాక ఆమె వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. మౌనరాగం ,సూరిగాడు, మామగారు, పుట్టింటి పట్టుచీర, జడ్జిమెంట్ ,ఇన్స్పెక్టర్ రుద్ర, ఎర్రమందారం ఘటన ఇలాంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది యమున. అలా సుమారుగా 70 సినిమాలకు పైగా నటించింది.