English | Telugu

సర్ప్రైజ్ ఇచ్చిన అనూజా...షాకైన అవినాష్


ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద జబర్దస్త్ కమెడియన్ గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసాడు. అవినాష్ శ్రీముఖి మంచి ఫ్రెండ్స్..వీళ్ళ కాంబినేషన్ చాలా షోస్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఇక శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ లో శ్రీముఖితో పాటు అవినాష్ కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి అవినాష్ మ్యారేజ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక భార్య అనూజా కూడా చాలా షోస్ లో ఇప్పటికే కనిపించింది. అలాంటి ఆమె ఇప్పుడు గర్భిణిగా ఉండడంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడ తల్లి సమక్షంలో గడుపుతోంది.

అలాంటి అనూజా మణికొండలో ఒక ఫంక్షన్ వెళ్లి ఆ పక్కనే ఉన్న తన ఇంటికి సడెన్గా వచ్చేసరికి అవినాష్ ఏమయ్యిందా అని ఉలిక్కిపడ్డాడు. ఇక ముందస్తూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అనూజా అవినాష్ దగ్గరకు వెళ్ళింది. లక్కీగా అవినాష్ కూడా షూటింగ్ లేకపోవడంతో ఇంట్లోనే ఉండడంతో అనూజ్ హ్యాపీగా ఫీల్ అయింది. ఇక అవినాష్ తన పాత్రలు తానే కడుక్కుంటూ ఇంటిని శుభ్రంగా ఎలా పెట్టుకున్నాడో చూపించాడు. ఇక కడుపులో బేబీ కదులుతోంది అనూజా చెప్పేసరికి అవినాష్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. సెప్టెంబర్ 19 వస్తే 7 వ నెల వస్తుంది కదా అప్పటి నుంచి ఇంకా బాగా బేబీ కదలికలు తెలుస్తాయి అని చెప్పాడు అవినాష్. సెప్టెంబర్ 22 న నా పుట్టినరోజు కదా నువ్వు వస్తావుగా అని అడిగేసరికి నేను లేకుండా నీ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అంది అనూజా. ఇక ఈ విరహాన్ని భరించలేక "నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా" అనే పాట కూడా పాడాడు అవినాష్. ఇక ఇప్పుడు బుక్స్ కూడా చదువుతున్నట్లు చెప్పింది అనూజా..