English | Telugu

పెద్ద స్టార్స్ కి మాత్రమే ఫుల్ క్యారవాన్ ఇస్తారు!

"నీతోనే డాన్స్" షో మొదలైన దగ్గర నుంచి ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. ఇక ఈ షోకి జడ్జిగా ఉన్న తరుణ్ మాష్టర్ వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తరుణ్ మాష్టర్ రీసెంట్ గా "గరం మసాలా విత్ తరుణ్ మాష్టర్" అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. ఇందులో అన్ని రకాల వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి తరుణ్ మాష్టర్ ఇప్పుడు రాధ, సదా గార్ల క్యారవాన్ వీడియో చేశారు. ఒక క్యారవాన్ లో సగం సదా గారికి, సగం తరుణ్ మాష్టర్ కి ఇచ్చారు. కానీ రాధ గారికి మాత్రం ఒక ఫుల్ క్యారవాన్ ఇచ్చేసారు. అలా ఎందుకు ఇచ్చారో కూడా చెప్పారు తరుణ్ మాష్టర్. ఈ క్యారవాన్ ఓన్లీ ఫర్ స్టార్ సెలబ్రిటీస్ కి మాత్రమే ఇస్తారట. ఎందుకంటే వాళ్లకు కాస్ట్యూమ్స్, షూట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్లకు ఈ క్యారవాన్ మొత్తాన్ని ఇచ్చేస్తారట.

ఈ క్యారవాన్ లో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కి ఈ క్యారవాన్ ని పంపిస్తారట..ఇది ఎగ్జిక్యూటివ్ వ్యాన్..దీనికి పక్కా సెక్యూరిటీ ఉంటుందట. అలాగే లోపల అన్ని రకాల ఫెసిలిటీస్ ని కూడా ఆయన వీడియోలో చూపించారు. రెండు నెలల ముందుగా షూటింగ్స్ షెడ్యూల్ చెప్తేనే ఈ క్యారవాన్ ని బ్లాక్ చేస్తారని చెప్పారు. ఇక ఈ వ్యాన్ లో ఏ స్టార్ ఐతే ఉంటారో వాళ్ళ అభిరుచి ప్రకారం లోపల డిజైనింగ్ చేస్తారట. ఇలాంటి క్యారవాన్ లోకి వచ్చేసరికి నేనే కొంచెం చిరంజీవిలా ఫీలవుతున్న..అన్నారు తరుణ్ మాష్టర్..ఇక వన్ అవర్ ఉంది అంటే మేకప్ టకటకా వేసేస్తారు. ఇంత స్పీడ్ గా మేకప్ వేయించుకోవడం అనే విషయాన్ని ఎక్కువగా శ్రీదేవి, మాధురి దీక్షిత్ గారి దగ్గర చూసాను. కాస్ట్యూమ్ చేంజ్ అనగానే ఒక్క అరగంటలో వచ్చి మొత్తం చేంజ్ చేసుకుని వెళ్లిపోయేవాళ్లు. ఫారెన్ షూటింగ్స్ జరిగే టైంలో మేకప్ మేన్స్ ఎవరూ ఉండరు. ఒకే ఒక్క పెద్ద బస్సు ఉంటుంది. అందులోనే అన్ని ఉంటాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటే మిగతా వాళ్లంతా బస్సులోంచి కిందకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసేస్తారు. అలాగే ఈ క్యారవాన్ లో ఒకే ఒక్క టాయిలెట్ ఉంటుంది. ఇక ఫారెన్ షూటింగ్స్ లో కూర్చోవడానికి కుర్చీ, వేసుకోవడానికి గొడుగు, తినడానికి డైనింగ్ టేబుల్ లాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. అలాంటి టైములో మార్నింగ్ 6 నుంచి రాత్రి సూర్యుడి వెలుగు ఉండేవరకు షూటింగ్స్ చేస్తారు అని మొత్తం చెప్పారు తరుణ్ మాష్టర్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.