English | Telugu

చందమామను చూపించకుండా డ్రామా జూనియర్స్ చూపించి అన్నం పెడుతున్నారు

చిన్నారులు హిలేరియస్ స్కిట్స్ తో ఎంతోమందిని అలరిస్తున్న డ్రామా జూనియర్స్ సీజన్ 6 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక జయప్రద, శ్రీదేవి, బాబూమోహన్ స్టేజి మీదకు వచ్చేసరికి యాంకర్ ప్రదీప్ ఒక స్వీట్ కామెంట్ చేసాడు. "ఇది వరకు చందమామను చూపించి అన్నం తినిపించేవాళ్లు చిన్నప్పుడు..కానీ ఇప్పుడు చూపించట్లేదు" అని చెప్పాడు. దానికి జయప్రద ఎందుకు అని అడిగింది "ఇప్పుడు డ్రామా జూనియర్స్ చూపిస్తున్నారు ఎందుకంటే రెండు చందమామలు ఇక్కడే ఉన్నాయి కదా" అనేసరికి వాళ్ళు నవ్వేశారు. ఇక ఈ ఎపిసోడ్ కి "హిడింబా" మూవీ నుంచి అశ్విన్, నందిత శ్వేతా వచ్చారు. "హలో నందిత గారు ఎలా ఉన్నారు" అని ప్రదీప్ ఏమీ తెలియనట్టు అడిగేసరికి "ఏమీ తెలియనట్టే మాట్లాడుకుంటారు మీరిద్దరూ" అని అశ్విన్ బాబు కౌంటర్ వేశారు.

దానికి "నాకు ప్రదీప్ అంటే ఇష్టం" అని చెప్పారు నందిత. ఆ మాటకు ప్రదీప్ సిగ్గుపడిపోయారు. ఇక ఈ షోకి "రాధమ్మ కూతురు" సీరియల్ నుంచి అరవింద్- అక్షర వచ్చారు. హిడింబ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆ మూవీ టీమ్ షోకి వచ్చింది. ఇక చిన్నారులు అల్లూరి సీతారామరాజ్ స్కిట్ వేశారు. అలాగే ఇంకో టీమ్ రైతు పడే కష్టాలను చూపించారు. దాంతో బాబూమోహన్ చాలా ఎమోషనల్ ఇపోయారు. "రైతు పంట మీద ఎంత ఆశ పెట్టుకుంటాడంటే..ఎన్నో కలలుగంటారు..కలలు ఇలా కల్లలు ఐపోయినప్పుడు ఇలా హృదయవిదారకంగా ఉంటుందని బాగా చూపించావు" అంటూ ఆ చిన్నారిని మెచ్చుకున్నారు. ఆ స్కిట్ లో ఆ చిన్నారి పడే బాధకు మిగతా పిల్లలు కూడా ఏడ్చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.