English | Telugu
యాంకరింగ్ కి గుడ్ బై..సుమ షాకింగ్ నిర్ణయం!
Updated : Dec 27, 2022
యాంకర్ సుమ తెలుగు ఆడియన్స్ కి ఎంతో దగ్గరైన మలయాళీ అమ్మాయి. ఎవరినైనా మాటలతో, హావభావాలతో, యాంకరింగ్ తో కట్టిపడేస్తుంది సుమ. ఈవెంట్స్ లో మైక్ పట్టుకుంటే అంతే. అక్కడ ఉన్నది స్టార్ హీరో కావొచ్చు అప్ కింగ్ హీరోయిన్ ఐనా కావొచ్చు ఆమె పేల్చే పంచులకు పగలబడి నవ్వాల్సిందే.
ఐతే ఇప్పుడు సుమ యాంకరింగ్ కి కాస్త బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇటీవల రిలీజ్ ఐన "వేర్ ఈజ్ ది పార్టీ" లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయాన్ని వెల్లడించింది. "నేను మలయాళీ ఐనా కూడా ఇక్కడ సెటిల్ అయ్యాను అంటే దానికి కారణం తెలుగు వాళ్ళు చూపిన అభిమానం, ప్రేమ.. వాళ్ళు లేకపోతే నేను లేను..ఇది రాసిపెట్టుకోండి..కానీ నేను కొంత విరామం ఐతే తీసుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్తూ కన్నీళ్లు తుడుచుకుంది సుమ. ఎంత వరకు మాట్లాడాలో తెలిసిన ఒక బెస్ట్ యాంకర్ సుమ. కొత్త యాంకర్స్ కి ఆమె ఒక నిఘంటువు లాంటిది అని చెప్పొచ్చు.