English | Telugu

సుమ అలా అందరినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టే ఆ పేరు...

సుమకి కొత్త అర్ధం హైపర్ ఆది. "వేర్ ఈజ్ ది పార్టీ" ఈవెంట్ కి సంబంధించిన మరో కొత్త ప్రోమో రీసెంట్ గారిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ యాక్టర్స్ అంతా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇంతలో "మౌన పోరాటం" సీరియల్ లో నటిస్తున్న యమున వచ్చి "ఇంతకు మీరు మౌనపోరాటం చూస్తారా..ఐతే లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చెప్పండి" అని హోస్ట్ సుమకి రిస్కీ ప్రశ్న వేసేసరికి సుమ సైలెంట్ గా నిలబడి "నేను మౌన పోరాటం చేస్తున్నాను" అని కౌంటర్ వేసింది.

తర్వాత ఆది సగం వైట్, సగం నారింజ రంగుతో ఉన్న షర్ట్ వేసుకొచ్చాడు... దాంతో పాటు ఒక చేతికి మల్లె పూల దండ చుట్టుకుని మరో చేతిలో కమండలం పట్టుని స్టేజి మీదకు డాన్స్ చేస్తూ వచ్చాడు. "ఈరోజు ఎలాగైనా పెళ్లి అవ్వాలి లేదా హిమాలయాలకు వెళ్ళిపోవాలి" అంటూనే స్టేజి మీద కూర్చున్న ఒక బ్యూటిఫుల్ లేడీని చూసి "ఎవరో ఆ అమ్మాయి చాలా బాగుంది అక్కడ"..అనేసరికి "ఏయ్ నువ్వు చూడొద్దు, మాట్లాడొద్దు" అని రూల్స్ పెట్టేసరికి ఆదికి ఫ్రస్ట్రేషన్ వచ్చి "నాకు ఇప్పుడు అర్ధమయ్యింది సుమ అంటే అర్ధమేంటో ...సు అంటే సూడనివ్వదు, మ అంటే మాట్లాడనివ్వదు" అనేసరికి షాకయ్యింది సుమ..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.