English | Telugu

అవినాష్ పెళ్లిలో విష్ణు ప్రియ వ్లాగ్‌..

ముక్కు అవినాష్ బుల్లితెర‌పై చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గ‌తంలో జ‌బ‌ర్ద‌స్త్ షోలో త‌న‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుని న‌వ్వించిన అవినాష్ ఆ త‌రువాత బిగ్‌బాస్ సీజ‌న్ 4 లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. టాప్ 5 దాకా ఫైట్ చేసి చివ‌రి ద‌శ‌లో షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. మ‌ల్లెమాల అగ్రిమెంట్ కార‌ణంగా ప‌ది ల‌క్ష‌లు పోగొట్టుకున్న అవినాష్ ఆ డ‌బ్బులు మ‌ల్లెమాల వారికి క‌ట్టి మ‌రీ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో లో అవినాష్ విన్న‌ర్ కాలేక‌పోయినా చాలా మంది దృష్టిని ఆక‌ర్షించ‌డంతో స‌ఫ‌లం అయ్యాడు.

మ‌ల్లెమాల అగ్రిమెంట్ కార‌ణంగా వారికి అవినాష్ ప‌ది ల‌క్ష‌లు క‌ట్టి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ ద్వారా అత‌నికి భారీ మొత్త‌మే అందింద‌ని తెలిసింది. ఇదిలా వుంటే అవినాష్ ప్ర‌స్తుతం నాగ‌బాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కామెడీ స్టార్స్ ధ‌మాకాలో స్కిట్ లు చేస్తున్నాడు. గ‌త కొంత కాలంగా ఈ షోలో క‌నిపించ‌కుండా పోయిన అవినాష్ తిరిగి మ‌ళ్లీ యాక్టీవ్ గా మారిపోయాడు. ఈ షోకు దీపిక పిల్లి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌చ్చే ఆదివారం ప్ర‌సారం కానున్న షోకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.

Also Read:అషురెడ్డిని ఆడుకున్న నెటిజ‌న్స్‌.. ఏం జ‌రిగింది?

నాలుగు స్కిట్ ల‌కు దూరంగా వుంటే త‌న‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌ని త‌న ఫ్ర‌స్ట్రేష‌న్ ని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఇదే ప్రోమోలో యాంక‌ర్ విష్ణు ప్రియ‌పై షాకింగ్ పంచ్ లేశాడు. త‌న పెళ్లిలోవిష్ణు ప్రియ వ్లాగ్ చేసింద‌ని, నా పెళ్లిలో వ్లాగ్ చేయ‌డానికి అది ఎవ‌తిరా? అంటూ హ‌ల్ చ‌ల్ చేశాడు. నేను వ్లాగ్ చేద్దామ‌ని ప్లాన్ చేసుకుంటే త‌ను ఉద‌యం ఏడు గంట‌ల నుంచే వ్లాగ్ మొద‌లుపెట్టి త‌న ఛాన‌ల్ లో పోస్ట్ చేసింద‌ని, నేను చేసిన వీడియోని ఎవ‌రూ చూడ‌లేద‌ని, వీవ‌ర్షిప్ మొత్తం విష్ణు ప్రియ ఛాన‌ల్ కే వెళ్లిపోయింద‌నిఅవినాష్ త‌న బాధ‌ని వ్య‌క్తం చేశాడు. పెళ్లి పేరుతో అవినాష్ చేసిన స్కిట్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తూ న‌వ్వులు పూయిస్తోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...