English | Telugu
శుభశ్రీ ఎలిమినేటెడ్.. సీక్రెట్ రూమ్ కి గౌతమ్ కృష్ణ!
Updated : Oct 9, 2023
బిగ్ బాస్ సీజన్-7 లొ కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఇప్పటికే హౌజ్ అంతా కళకళలాడుతుంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మొదట్లోనే నామినేషన్లో ఉన్నవారిలో నుండి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు.
నామినేషన్లో ఉన్నవారిని చీకటి గదికి తీసుకెళ్ళి అక్కడ ఒక దెయ్యం లాంటి గెటప్ గల వ్యక్తి ని పంపి, ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వారిని అతను నా దగ్గరికి తోసుకొస్తారని కంటెస్టెంట్స్ అందరికి చెప్పగా అందరు భయపడ్డారు. ఆ తర్వాత శుభశ్రీని ఆ వ్యక్తి సెలక్ట్ చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చేశాడు. ఇక స్టేజ్ మీద ఉన్న నాగార్జున శుభశ్రీ ఎలిమినేటెడ్ అనగానే హౌజ్ లోని వాళ్ళంతా షాక్ అయ్యారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే టేస్టీ తేజ, ప్రియాంక జైన్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు. ఇక శుభశ్రీ ఎలిమినేట్ అవ్వగానే గౌతమ్ కృష్ణ ఎమోషనల్ అయ్యాడు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన శుభశ్రీ ఎమోషనల్ జర్నీ చూపిస్తాడు నాగార్జున. అక్కడ హౌజ్ మేట్స్ కి సలహాలు ఇచ్చింది శుభశ్రీ. ఆ తర్వాత శుభశ్రీ బై చెప్పేసి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మొదట శివాజీ సేవ్ అవుతాడు. ఆ తర్వాత యావర్, ప్రియాంక జైన్ సేవ్ అవుతారు. ఇలా ఒక్కొక్కరు సేవ్ అవ్వగా అమర్ దీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ ముగ్గురు మిగులుతారు. గార్డెన్ ఏరియాలో అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఫోటోలని మూడు స్టాండ్ లకి ఉంచారు. అందులో రెండు కాలిపోతాయి. ఒకటి కాలదని వారే సేఫ్ అని నాగార్జున అనగా.. కాసేపటికి అమర్ దీప్ సేవ్ అవుతాడు. ఇక మిగిలిన ఇద్దరిలో గౌతమ్ కృష్ణని హౌజ్ మేట్స్ అంతా కలిసి ఎలిమినేట్ చేస్తారు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన గౌతమ్ కృష్ణ.. ఎమోషనల్ అవుతాడు. హౌజ్ లో ఎవరెవరు ఎలా ఉంటారో చెప్పమని చెప్పగా గౌతమ్ కృష్ణ చెప్తాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ వెళ్ళిపోతుండగా.. గౌతమ్ కృష్ణని నాగార్జున వెనక్కి పిలుస్తాడు. "నీకొక అవకాశం ఇస్తున్నాను, సీక్రెట్ రూమ్ కి పంపిస్తున్నాను. అక్కడ నువ్వు ఎలా ఉండాలో, నీకేం కావాలో బిగ్ బాస్ చూసుకుంటారు. నిన్ను నువ్వు నిరూపించుకో" అని నాగార్జున చెప్తాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ కి వెళ్ళి టీవీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నింటిని చూస్తుంటాడు గౌతమ్ కృష్ణ.