English | Telugu
కేక పుట్టిస్తున్న స్టుడెంట్ ట్రైలర్!
Updated : Sep 2, 2023
కాలేజ్ లైఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ స్టోరీ అయిన దాదాపు హిట్టే.. అప్పుటి కొత్తబంగారు లోకం, హ్యాపీ డేస్ ల నుండి ఇప్పటి బేబీ సినిమా వరకు అన్ని యూత్ ని ఆకర్షిస్తూ వెండితెర మీద పేపర్లు విసిరేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తో షణ్ముఖ్ 'స్టూడెంట్' వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ని కొన్ని వారాల క్రితం రిలీజ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. అంతే కాకుండ 'ది స్టూడెంట్ యాంథమ్' లిరికల్ సాంగ్ కి షణ్ముఖ్ తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు. ఆ సాంగ్ కి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
షణ్ముఖ్.. యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్.. ఆ తర్వాత 'సూర్య' వెబ్ సిరీస్ తో ప్రతీ మధ్యతరగతి కుర్రాడికి కనెక్ట్ అయ్యాడు. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి స్నేహితులుగా మారారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -5 లో షణ్ముఖ్ ఎంట్రీ ఇచ్చాడు. అదే సీజన్ లో సిరి హనుమంత్ కూడా రావడంతో.. వారిద్దరి హౌస్ లో క్లోజ్ గా ఉండటం వల్ల దీప్తి సునైన, షణ్ముఖ్ ల మధ్య కథ మారింది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు వరకు షణ్ముఖ్, దీపు వాళ్ళిద్దరి చేతిపై టాటూస్ ఉండేవి. బిగ్ బాస్ పూర్తయ్యాక వారిద్దరు విడిపోయారు. ప్రస్తుతం ఎవరి బిజీలో వాళ్ళుంటున్నారు.
షణ్ముఖ్ 'స్టుడెంట్' వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ తన యు ట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు. అలా చేసిన అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా వ్యూస్ వచ్చాయి. అసలేముంది ఈ ట్రైలర్ లో అంటే.. స్టుడెంట్స్ ముందుగా పరిచయాలు, స్నేహం, ప్రేమ.. గొడవలు ఇలా స్టార్ట్ చేస్తారు. అయితే ఇవన్నీ ప్రతీ స్టుడెంట్ లైఫ్ లో కామన్. అయితే ఎప్పుడైతే వాళ్ళకి ఎదురుదెబ్బ తగులి కిందపడతారో, అప్పుడు వాళ్ళు మళ్ళీ పైకీ లేస్తారు. అలా అనుభవంలోకి వస్తేనే గానీ తెలియదని చూపించారు మేకర్స్. మరీ ఈ నెల యూట్యూబ్ లో విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.