English | Telugu

శ్రీహాన్ ని మార్చేసిన సిరి!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామీలీ వీక్ లో సిరి హనుమాన్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాగా సిరి హౌస్ లోకి వచ్చి వెళ్ళిన తర్వాత శ్రీహాన్ లో చాలా మార్పు వచ్చిందని హౌస్ మేట్స్ అందరూ భావిస్తున్నారు.

కాగా తాజాగా సిరి బిబి కేఫ్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.‌ ఇందులో అరియానాతో చాలా విషయాలను పంచుకుంది సిరి. తను శ్రీహాన్ కి ఏమీ చెప్పలేదని చెప్పుకొచ్చింది. అయితే అరియానా "ఏంటీ మీ వోడు నువ్వు వెళ్ళొచ్చాక మారిపోయాడు అనే జపం వినిపిస్తోంది" అని అడిగేసరికి, "నేనేం చేయలేదు. ఇండివిజువల్ గా ఆడు.. వెటకారంతగ్గించుకో" అని చెప్పాను అని అంది. "ఎవరూ హైలైట్ అవ్వనిది శ్రీహాన్ మాత్రం హైలైట్ అవుతున్నాడు. మారాడు" అని అరియానా అడిగింది. దానికి సిరి మాట్లాడుతూ " వాళ్ళ పక్కనున్న ఫ్రెండ్సే అలా వంద సార్లు అనడం వల్ల హౌస్ లో ఉన్నవాళ్ళకి, అలాగే బయట చూసే ఆడియన్స్ కి.. మైండ్ లో‌ఎక్కడో అవునా.. అవునా అనే పాయింట్ కి వెళ్తారు " అని చెప్పింది సిరి.

ఆ తర్వాత సిరిని, శ్రీసత్య గురించి అరియానా అడిగి తెలుసుకుంది. "బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవెర్ అనే ట్యాగ్ ఎవరూ శ్రీహాన్ కి ఇవ్వలేదు ఎందుకంటావ్" అని అడిగేసరికి, "నాకే బాధనిపించింది. అలాంటిది అక్కడున్న తను ఎంత బాధపడి ఉంటాడు" అని ఎమోషనల్ అయింది సిరి. ఆ తర్వాత సరదగా కొన్ని యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ని చూపించగా, అందులో ఒక్కో థంబ్‌నెయిల్చూసి నవ్వుకున్నారు ఇద్దరు. ఇలా సిరి మాట్లాడుతూ "ఎలాగైనా గెలిచి రా శ్రీహాన్.. ప్లీజ్ సపోర్ట్ ఆడియన్స్" అని చెప్పింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.