English | Telugu

కంగ్రాట్స్ ఎందుకు చెప్పాలంటూ మెహబూబ్ పరువు తీసేసిన శ్వేతనాయుడు

బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం ప్రతీ వారం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని రెడీ చేస్తూ ఉన్నారు మేకర్స్ . అలాంటి కొన్ని షోస్ లో కొత్తగా స్టార్ట్ ఐన షో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ కూడా ఒకటి. ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షోకి సీరియల్ ఆర్టిస్టులు, కపుల్స్, సోషల్ మీడియాలో పాపులరైన వారంతా వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

రాబోయే వారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మెహబూబ్ – శ్వేతా నాయుడు, సిద్ధూ – సోనియా సింగ్, యాంకర్ స్రవంతి చొక్కారపు – ప్రశాంత్ జంటలుగా పాల్గొన్నారు. ఫస్ట్ స్టేజి మీదకు మెహబూబ్ – శ్వేతా ఎంట్రీ ఇచ్చారు. కేజీఎఫ్ 2లో మెహబూబా సాంగ్ కి డాన్స్ చేశారు. అయితే.. డాన్స్ అయ్యాక శ్వేతా మెహబూబ్ దగ్గరికి వచ్చి.. "చెవిలో కంగ్రాట్స్ చెప్పినట్టే చెప్పి ఏం పీకావని కంగ్రాట్స్ చెప్పడానికి..’ అని సెటైర్ వేసింది. ఆ తర్వాత దిల్ సే అంటే మొదట్లో మెహబూబ్ ఇంటిపేరు అనుకున్నాను అని పంచ్ వేసి పరువు తీసేసింది.