English | Telugu

మాల్దీవ్స్ లో మసాల్ వడ...

స్మాల్ స్క్రీన్ యాంకర్ దీపికా పిల్లి మాల్దీవ్స్ లో ఛిల్అవుతోంది. అంతేకాదు వెకేషన్ తో పాటు ఫోటో షూట్స్ కూడా పనిలో పనిగా కానిచ్చేస్తుంది. మాల్దీవ్స్ లోని ప్రకృతి అందాలను మైమరచిపోయి ఆస్వాదిస్తోంది. దీపికా పిల్లి కేరీర్ మంచి ఫాస్ట్ ఫార్వార్డ్ గా సాగిపోతోంది. "వాంటెడ్ పండుగాడ్" మూవీ తర్వాత ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. అలా బుల్లి తెర మీద సిల్వర్ స్క్రీన్ మీద దూసుకుపోతోంది. ‘కామెడీ స్టార్ ధమాకా’తో యాంకర్ గా టీవీ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది దీపికా.

ఇప్పుడు సుధీర్ తో కలిసి ఆహాలో వస్తున్న "కామెడీ స్టాక్ ఎక్స్చేంజి" కామెడీ షోకి హోస్ట్ గా చేస్తోంది. ఏ ఇండస్ట్రీ బ్యూటీస్ ఐనా సరే వెకేషన్ అంటే చాలు ముందుగా గుర్తొచ్చే పేరు మాల్దీవ్స్.. కొంచెం టైం దొరికినా అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఎల్లో కలర్ షార్ట్ గౌన్ లో బీచ్‌లో కూర్చుని, కళ్ళు మూసుకుని, నవ్వుతూ, ఇసుకుతో ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తోంది దీపికా పిల్లి. ఇక ఈ ఫోటో షూట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసేసరికి అవి వైరల్ అవుతున్నాయి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.