English | Telugu

శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త కాన్సెప్ట్...

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఐతే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు డ్రామా కంపెనీ వాళ్ళు. శ్రీదేవి సెట్ మొత్తాన్ని కూడా స్మశానంలా మార్చేశారు. ఇందులో ఆది, నాటీ నరేష్ ఇద్దరూ ఇద్దరూ నల్ల రెండు డ్రెస్సులో కనిపించారు. ఇక దెయ్యం గెటప్ లో రోహిణి వైట్ శారీలో "నంది కొండా వాగుల్లో" అనే పాటకు డాన్స్ చేస్తూ ఆదిని ఆట పట్టిస్తూ కనిపించింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఆ సెట్ ని శ్రీదేవిపురంగా మార్చేశారు.

తర్వాత మిగతా జెంట్స్ దెయ్యాలు వచ్చారు. ఆది మీదకు వచ్చి వాళ్లంతా దాడి చేసేసరికి "ఇంతకు మీకేం కావాలో చెప్పండి" అని అడిగాడు. "మా ఆత్మలు శాంతించేలా ఏదో ఒకటి చెయ్యి" అన్నాడు బులెట్ భాస్కర్. "అంటే మీ కోరికలు తీరిస్తే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారు అంతేనా" అన్నాడు ఆది. తరువాత దెయ్యంతో పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ తో ఒక స్కిట్ వేశారు. అందులో సద్దాం దెయ్యంలా పిల్లనిచ్చేవాడిగా కనిపించాడు. దెయ్యాన్ని పెళ్లి చేసుకునే పెళ్లికొడుకుగా యాదమ్మ రాజు కనిపించాడు. ఫైనల్ గా ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెర మీదకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ని ఈ ఎపిసోడ్ లో ప్రవేశపెట్టారు. అందులో పటాస్ ప్రవీణ్ వాళ్ళ అమ్మ, అలాగే పండు వాళ్ళ అమ్మ, తాగుబోతు రమేష్ వాళ్ళ అమ్మా నాన్నని చూపించి వాళ్ళతో మాట్లాడించారు. "చిన్నా ప్రవీణ్ బాగున్నావా" అని ప్రవీణ్ వాళ్ళ అమ్మ ఏఐ మాట్లాడితే, "చింటూ ఎలా ఉన్నావ్ రా" అని పండు వాళ్ళ అమ్మ మాట్లాడినట్టు చూపించారు. ఇక వాళ్ళ అమ్మలు చూసాక ఏడ్చేశారు. "రోజూ పడుకునే ముందు అమ్మనే తలుచుకుంటా" అన్నాడు ప్రవీణ్, "మా అమ్మ వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలీదు..కానీ ఈ వాయిస్ వినేసరికి నాకు కాళ్ళూ చేతులు ఆడలేదు" అని ఫీలయ్యాడు పండు. "చిన్నప్పుడు మా అమ్మ చనిపోతే మొత్తం చీకటైపోయినట్టు ఐపోయింది" అంటూ తాగుబోతు రమేష్ ఏడుస్తూ చెప్పాడు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.